భారీగా పెరిగిన బంగారం ధర.. ప్రధాన నగరాల్లో ఎంతంటే
January 27th Gold Rate.పసిడిని కొనుగోలు చేయాలనుకునే వారికి ధరలు షాకిస్తున్నాయి. ఇక పసిడి ధరల్లో
By తోట వంశీ కుమార్ Published on 27 Jan 2022 2:07 AM GMTపసిడిని కొనుగోలు చేయాలనుకునే వారికి ధరలు షాకిస్తున్నాయి. ఇక పసిడి ధరల్లో నిత్యం హెచ్చుతగ్గులు చోటుచేసుకుంటాయి. ఓ రోజు ధర తగ్గితే.. మరో రోజు పెరుగుతూ ఉంటుంది. దీంతో కొనుగోలుదారులు వాటి ధరలపై ఓ కన్నేసి ఉంచుతారు. ఇక గురువారం పసిడి ధర పెరిగింది. 10 గ్రాముల బంగారం ధరపై రూ.250 మేర పెరిగింది. దేశీయంగా 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.45,900 ఉంగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,830 వద్ద కొనసాగుతోంది.
ప్రధాన నగరాల్లో పసిడి ధరలు..
- ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.45,900, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,830
- ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.45,900, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,830
- చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,370, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,590
- కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.45,900, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,600
- బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.45,900, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,100
- పూణెలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.45,760, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,910
- హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.45,900, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,100
- విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.45,900, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,100
- విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.45,900, 24 క్యారెట్ల ధర రూ.50,100
బంగారం ధరల్లో హెచ్చుతగ్గులకు ఎన్నో కారణాలుంటాయి. అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, కరోనా, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు బంగారం రేట్లపై అధిక ప్రభావం చూపే అవకాశం ఉందని బులియన్ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.