తెలుగురాష్ట్రాల్లో ఈ రోజు బంగారం ధర పెరిగిందా..? తగ్గిందా..?
January 26th Gold Rate.మనదేశంలో బంగారానికి భారీ డిమాండ్ ఉంటుంది. ఆర్థిక అవసరాల్లో బంగారానికి
By తోట వంశీ కుమార్ Published on 26 Jan 2022 2:23 AM GMTమనదేశంలో బంగారానికి భారీ డిమాండ్ ఉంటుంది. ఆర్థిక అవసరాల్లో బంగారానికి మించి మరేది అక్కరదు రాదు అనేది అందుకు ప్రధాన కారణం కావచ్చు. కాబట్టి బంగారం ధర ఎంత పెరిగినప్పటికి వాటిని కొనుగోలు చేసేందుకు మాత్రం ఏమాత్రం వెనకడుగు వేయరు. ఇక పసిడి ధరల్లో నిత్యం మార్పులు చోటు చేసుకుంటాయన్న సంగతి తెలిసిందే. దీంతో కొనుగోలుదారులు వాటి ధరలపై ఓ కన్నేసి ఉంచుతారు. ఇక బుధవారం పసిడి ధరలు బాగా దిగివచ్చాయి. తెలుగు రాష్ట్రాలతో పాటు మరికొన్ని ప్రాంతాల్లో పసిడి ధర తగ్గగా.. ముంబై వంటి ప్రాంతాల్లో స్వల్పంగా పెరిగింది.
ప్రధాన నగరాల్లో పసిడి ధరలు..
- ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.45,750, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,000
- ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.45,750, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,680
- చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,050, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,240
- కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.45,750, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,500
- బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.45,750, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,910
- పూణెలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.45,750, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,900
- హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.45,750, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,910
- విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.45,750, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,910
- విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.45,750, 24 క్యారెట్ల ధర రూ.49,910
బంగారం ధరల్లో హెచ్చుతగ్గులకు ఎన్నో కారణాలుంటాయి. అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, కరోనా, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు బంగారం రేట్లపై అధిక ప్రభావం చూపే అవకాశం ఉందని బులియన్ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.