వరుసగా మూడో రోజు పెరిగిన బంగారం ధర.. ఎంతంటే
January 22nd Gold rate.బంగారానికి మనదేశంలో లాగా ఉన్న డిమాండ్ మరే దేశంలోనూ ఉండదు. ధర పెరిగినప్పటికి
By తోట వంశీ కుమార్ Published on 22 Jan 2022 1:50 AM GMTబంగారానికి మనదేశంలో లాగా ఉన్న డిమాండ్ మరే దేశంలోనూ ఉండదు. ధర పెరిగినప్పటికి కొనుగోలు చేసేందుకు మాత్రం వెనకడుగు వేయరు. ఇక పసిడి ధరల్లో నిత్యం మార్పులు చోటు చేసుకుంటూనే ఉంటాయి. ఓ రోజు ధర తగ్గితే.. మరో రోజు పెరుగుతూ ఉంటుంది. వరుసగా మూడో రోజు కూడా పసిడి ధర పెరిగింది. శనివారం 10 గ్రాముల పసిడి ధరపై రూ.100 నుంచి రూ.180 మేర పెరిగింది. దేశీయంగా 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,640 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,640 వద్ద కొనసాగుతోంది.
ప్రధాన నగరాల్లో పసిడి ధరలు..
- ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,800, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,100
- ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,640, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,640
- చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.45,940, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,120
- కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,800, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,500
- బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.45,650, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,800
- పూణెలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,900, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,450
- హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.45,650, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,800
- విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.45,650, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,800
- విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.45,650, 24 క్యారెట్ల ధర రూ.49,800
బంగారం ధరల్లో హెచ్చుతగ్గులకు ఎన్నో కారణాలుంటాయి. అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, కరోనా, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు బంగారం రేట్లపై అధిక ప్రభావం చూపే అవకాశం ఉందని బులియన్ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.