నూతన సంవత్సరంలో షాకిచ్చిన బంగారం ధరలు
January 1st Gold Price.పసిడి ధరల్లో నిత్యం హెచ్చుతగ్గులు చోటు చేసుకుంటాయన్న సంగతి తెలిసిందే
By తోట వంశీ కుమార్ Published on 1 Jan 2022 7:53 AM ISTపసిడి ధరల్లో నిత్యం హెచ్చుతగ్గులు చోటు చేసుకుంటాయన్న సంగతి తెలిసిందే. ఓ రోజు ధర తగ్గితే మరో రోజు పెరుగుతూ ఉంటుంది. దీంతో బంగారాన్ని కొనుగోలు చేయాలనుకునే వారు వాటి ధరలపై ఓ కన్నేసి ఉంచుతారు. కొత్త సంవత్సరం తొలి రోజునే పసిడి ప్రియులకు బంగారం ధర షాకిచ్చింది. శనివారం 10 గ్రాముల బంగారంపై రూ.250 మేర పెరిగింది. దేశంలోని ఆయా ప్రాంతాల్లో డిమాండ్, పరిస్థితుల ఆధారంగా ధరల పెరుగుదల్లో తేడాలు ఉంటాయి.
ప్రధాన నగరాల్లో పసిడి ధరలు ఇలా..
- ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,250, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,520
- ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,010, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,010
- చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.45,250, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,370
- కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,150, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,850
- బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.45,100 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,200
- పూణెలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,410, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,930
- హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.45,100, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,200
- విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.45,100, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,200
- విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.45,100, 24 క్యారెట్ల ధర రూ 49,200
బంగారం ధరల్లో హెచ్చుతగ్గులకు ఎన్నో కారణాలుంటాయి. అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, కరోనా, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు బంగారం రేట్లపై అధిక ప్రభావం చూపే అవకాశం ఉందని బులియన్ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.