షాక్‌.. వ‌రుస‌గా రెండో రోజు పెరిగిన బంగారం ధ‌ర

January 13th Gold rate.బంగారం ధ‌ర‌ల్లో నిత్యం మార్పులు చోటు చేసుకుంటాయి. ఓ రోజు ధ‌ర పెరిగితే మ‌రో రోజు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  13 Jan 2022 2:18 AM GMT
షాక్‌.. వ‌రుస‌గా రెండో రోజు పెరిగిన బంగారం ధ‌ర

బంగారం ధ‌ర‌ల్లో నిత్యం మార్పులు చోటు చేసుకుంటాయి. ఓ రోజు ధ‌ర పెరిగితే మ‌రో రోజు త‌గ్గుతూ ఉంటుంది. దీంతో బంగారాన్ని కొనుగోలు చేయాల‌నుకునేవారు వాటి ధ‌ర‌ల‌పై నిత్యం దృష్టిసారిస్తుంటారు. ఇక వ‌రుస‌గా రెండో రోజు కూడా ప‌సిడి ధ‌ర పెరిగింది. గురువారం 10 గ్రాముల ప‌సిడి ధ‌ర పై రూ.100 నుంచి 360 మేర పెరిగింది. దేశంలోని ఆయా ప్రాంతాల్లో ఉన్న ప‌రిస్థితులు. డిమాండ్ ఆధారంగా ధ‌ర‌ల పెరుగుద‌ల్లో తేడాలుంటాయి.

ప్ర‌ధాన న‌గ‌రాల్లో ప‌సిడి ధ‌ర‌లు ఇలా..

- ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,950, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,210

- ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,940, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,940

- చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.45,000, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,010

- కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,100, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,800

- బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.44,800, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,880

- పూణెలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధ‌ర రూ.46,120, 24 క్యారెట్ల 10 గ్రాముల ధ‌ర రూ.48,630

- హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.44,800, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,880

- విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.44,800, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,880

- విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.44,800, 24 క్యారెట్ల ధర రూ.48,880

బంగారం ధరల్లో హెచ్చుతగ్గులకు ఎన్నో కారణాలుంటాయి. అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, కరోనా, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు బంగారం రేట్లపై అధిక ప్రభావం చూపే అవకాశం ఉందని బులియన్‌ మార్కెట్‌ నిపుణులు చెబుతున్నారు.

Next Story