కొత్త క్యాబ్-ఛాసిస్ వేరియంట్‌ను తీసుకొస్తున్న‌ ఇసుజు మోటార్స్ ఇండియా

తన మన్నిక, విశ్వసనీయత మరియు ఉత్పాదకతలకు పేరుగాంచిన ప్రపంచ-వ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన ఇసుజు D-MAX పికప్ వాణిజ్య వాహన విభాగములో వినియోగదారుల నిర్దిష్ట అవసరాలను నెరవేర్చుటకు ఇప్పుడు కొత్త క్యాబ్-ఛాసిస్ వేరియంట్ లో అందుబాటులో ఉంటుంది

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  18 Sep 2024 10:45 AM GMT
కొత్త క్యాబ్-ఛాసిస్ వేరియంట్‌ను తీసుకొస్తున్న‌ ఇసుజు మోటార్స్ ఇండియా

తన మన్నిక, విశ్వసనీయత మరియు ఉత్పాదకతలకు పేరుగాంచిన ప్రపంచ-వ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన ఇసుజు D-MAX పికప్ వాణిజ్య వాహన విభాగములో వినియోగదారుల నిర్దిష్ట అవసరాలను నెరవేర్చుటకు ఇప్పుడు కొత్త క్యాబ్-ఛాసిస్ వేరియంట్ లో అందుబాటులో ఉంటుంది. ఈ చర్యతో, ఇసుజు మోటార్స్ ప్రైవేట్ లిమిటెడ్, తన D-MAX వాణిజ్య పికప్ వాహనాల శ్రేణిని భారతదేశములో విస్తరించింది.

కొత్త ఇసుజు D-MAX 1.7 సింగిల్ క్యాబ్ క్యాబ్-ఛాసిస్ ఎస్‎టిడి వేరియంట్ పాడైపోయేవి, ఎఫ్‎ఎంసిజి, ఫుడ్ & క్యాటరింగ్, లాస్ట్-మైల్ డెలివరీ మొదలైన వివిధ వ్యాపారాలలో సుదూర ప్రయాణాలలో వాహనాల అప్లికేషన్స్ నిర్వహించే వినియోగదారుల అవసరాలను నెరవేరుస్తుంది. ఇటువంటి వినియోగదారులు ఇప్పుడు తమ వ్యాపార అవసరాలకు తగిన తమ సొంత లోడ్-బాడీస్ ను నిర్మించుటకు అనుకూలత కలిగి ఉంటారు.

ఒక 2.5 లీటర్ ఇసుజు 4JA1 ఇంజన్ ద్వారా ఆధారితమైన ఇసుజు D-MAX వాణిజ్య పికప్స్ శ్రేణి గంభీరమైన ఆకృతి స్ఫూర్తిని అందిస్తూ తమ విలక్షణమైన ఏరోడైనమిక్ బాహ్య డిజైన్ తో ఒక దూకుడు వైఖరిని ప్రదర్శిస్తాయి. బయటివైపు ఉన్న ఈ గంభీరమైన ఆకృతి మరియు ప్యాసెంజర్-వాహనము వంటి ఇంటీరియర్ లేఅవుట్ లతో ఇది వినియోగదారుడికి గర్వకారణం అవుతుంది. D-MAX శ్రేణిలో అత్యధిక నాణ్యత కలిగిన ఫాబ్రిక్ అప్హోల్స్టరీ తో వచ్చే సీట్లు ఉంటాయి మరియు కూర్చున్నవారి సౌకర్యము మరియు భద్రతల కొరకు ఎత్తును సరిచేయదగిన సీట్ బెల్టులు ఉంటాయి. GSI (గేర్ షిఫ్ట్ ఇండికేటర్) తో ఉన్న MID (మల్టి-ఇన్ఫర్మేషన్ డిస్ప్లే) క్లస్టర్ టార్క్యూ, ఇంధన నిర్వహణ మరియు డ్రైవ్‎టెరైన్ మన్నికలకు సంబంధించి వాహనము యొక్క ఉత్తమ ఫీచర్ ను నిర్ధారిస్తూ ఏ డ్రైవింగ్ పరిస్థితిలో అయినా డ్రైవర్ ఉత్తమ గేర్ ను ఉపయోగించుటకు అనుకూలపరుస్తుంది.

నిరూపిత ఇసుజుD-MAX కఠినమైనది, విశ్వసనీయమైనది మరియు సమర్థవంతమైనది. ఇది ఇసుజు యొక్క లెజెండరీ మన్నిక మరియు ఉత్తమ వాహన డైనమిక్స్ అందించే హెవీ-డ్యూటీ iGRIP ఛాసిస్. ఇసుజు D-MAX యొక్క క్యాబ్ ఎక్కువ భద్రతను నిర్ధారించే అధిక-తన్యత కలిగిన స్టీల్ నుండి తయారు చేయబడింది. వరుసగా స్వతంత్ర కాయిల్ స్ప్రింగ్స్ మరియు ధృఢమైన లీఫ్ స్ప్రింగ్స్ ఉన్న ఫ్రంట్ మరియు రియర్ సస్పెన్షన్ వాహనాన్ని మంచి స్థిరత్వాన్ని ఇస్తాయి. ఇది ఫ్రంట్ మరియు రియర్ క్రంపుల్ జోన్స్, క్రాస్ కార్ ఫ్రంట్ బీమ్, డోర్ సైడ్ ఇంట్రూషన్, కొల్లాప్సిబుల్ స్టీరింగ్ కాలమ్ మరియు డ్రైవ్‎ట్రెయిన్ కొరకు అండర్‎బాడి స్టీల్ ప్రొటెక్షన్ లతో బెస్ట్-ఇన్-క్లాస్ ఆక్యుపెంట్ సేఫ్టీతో వస్తుంది. అదనంగా D-MAX శ్రేణిలో BOS (బ్రేక్ ఓవర్‎రైడ్ సిస్టం) ఉంది. ఇది కంగారుగా బ్రేక్ వేసిన సందర్భములో ఇంజన్ కు పవర్ ను నిలిపివేస్తుంది (బ్రేక్ మరియు యాక్సిలేటర్ పెడల్స్ ను ఒకేసారి నొక్కినప్పుడు).

కొత్త వేరియంట్ ప్రారంభము గురించి మాట్లాడుతూ, శ్రీ. టోరు కిషిమోటో, డెప్యూటి మేనేజింగ్ డైరెక్టర్, ఇసుజు మోటార్స్ ఇండియా, ఇలా అన్నారు, “ఇసుజు D-MAX పోర్ట్‎ఫోలియోలో కొత్త D-MAX 1.7 క్యాబ్-ఛాసిస్ ఎస్‎టిడి వేరియంట్ యొక్క ప్రారంభముతో, మేము మా వినియోగదారులు ఎంచుకునేందుకు వివిధ వ్యాపారాల అవసరాల కొరకు ఒక సమగ్ర ఉత్పత్తి ఎంపికల శ్రేణిని అందిస్తున్నాము. భారతదేశములో పెరుగుతున్న రవాణా అవసరాల నేపథ్యములో, ఆధునిక వినియోగదారులు తమ వ్యాపారాలకు కీలకమైన ఉత్పాదకతను పెంచే బహుముఖ ప్రజ్ఞ మరియు పనితీరును అందించే విశ్వసనీయమైన వాహనము కొరకు చూస్తున్నారు. D-MAX 1.7 క్యాబ్-ఛాసిస్ ఎస్‎టిడి వేరియంట్ వినియోగదారులు తమ లోడ్-బాడి కాన్ఫిగురేషన్ ఎంచుకొనుటకు మరియు విలువను పెంచుకొనుటకు అనుకూలతను అందించే ఒక ఖచ్ఛితమైన ఎంపిక. ఇది వాణిజ్య వాహన పికప్ విభాగములో ఉన్న మా ప్రస్తుత ఉత్పత్తులకు ఇది ఒక ముఖ్యమైన ఉత్పత్తి విస్తరణ. ఇది వినియోగదారులు ‘తమ అభివృద్ధి పథములో ముందడుగు’ వేయుటకు సహకరిస్తుంది.”

ఈ ఇసుజు D-MAX వేరియంట్ దేశములో ప్రగతిశీల వ్యాపార వినియోగదారులకు బహుముఖ ప్రజ్ఞ మరియు విలువను అందించే ఉత్తమ పికప్ ఎంపిక అవుతుంది.

D-MAX సింగిల్ క్యాబ్ 1.7 క్యాబ్-ఛాసిస్ ఎస్‎టిడి వేరియంట్ ఆకర్షణీయమైన రూ. ₹9,99,990/- కు, అందుబాటులో ఉంటుంది, ఎక్స్-షోరూమ్, చెన్నై. వాహనము యొక్క బుకింగ్స్ ఈరోజు నుండి ప్రారంభం అవుతాయి మరియు తొందరలోనే డెలివరీలు మొదలు అవుతాయి.

వినియోగదారులు మరింత ఉత్పత్తి సమాచారము కొరకు సమీప ఇసుజు డీలర్షిప్ కు కాల్ చేయవచ్చు లేదా www.isuzu.in ను సందర్శించవచ్చు. వినియోగదారులు మరింత సమాచారము కొరకు 1800 4199 188 (టోల్ ఫ్రీ) పై సంప్రదించవచ్చు.

Next Story