ఐఫోన్ 16E రిలీజ్ చేసిన యాపిల్..ఒకే కెమెరాతో 48 మెగాపిక్సెల్

వరల్డ్ టెక్ దిగ్గజం యాపిల్ సంస్థ కొత్త ఫోన్‌ను రిలీజ్ చేసింది. ఐఫోన్ 16E ఇండియన్ మార్కెట్‌లో లాంఛ్ చేసింది.

By Knakam Karthik
Published on : 20 Feb 2025 7:09 AM IST

Business News, Apple, Iphones

ఐఫోన్ 16E రిలీజ్ చేసిన యాపిల్..ఒకే కెమెరాతో 48 మెగాపిక్సెల్

వరల్డ్ టెక్ దిగ్గజం యాపిల్ సంస్థ కొత్త ఫోన్‌ను రిలీజ్ చేసింది. ఐఫోన్ 16E ఇండియన్ మార్కెట్‌లో లాంఛ్ చేసింది. కొత్త ఐఫోన్ 16 సిరీస్‌లో భాగంగా 16ఈ పేరుతో తీసుకొచ్చారు. మరోవైపు తన అధికారిక స్టోర్ నుంచి ఐఫోన్ ఎస్ఈని తొలగించింది. మొదట ఐఫోన్ ఎస్‌ఈ4 ను రిలీజ్ చేయనున్నట్లు ప్రచారం జరిగినప్పటికీ కొత్త మోడల్ ఐఫోన్ 16 సిరీస్‌ను ఎక్స్‌పాండ్ చేసింది.

ఏ18 చిప్‌తో విడుదలైన ఈ ఫోన్ ఇతర ఐఫోన్ సిరీస్‌ల తరహాలోనే యాపిల్ ఇంటిలిజెన్స్‌తో పనిచేస్తుంది. తెలుపు, నలుపు రంగుల్లో లాంచ్ చేయగా, 128జీబీ, 256జీబీ, 512జీబీ వేరియంట్లలో లభిస్తుంది. దీని ధర రూ. 59,900 నుంచి ప్రారంభవుతుంది. ఐఫోన్ ఎస్ఈ4 కోసం ఫిబ్రవరి 21 నుంచి ప్రీ-ఆర్డర్ చేసుకోవచ్చని కంపెనీ తెలిపింది. సాధారణ అమ్మకాలు ఫిర్బవరి 28 నుంచి మొదలవుతాయని వెల్లడించింది.

ఫీచర్లకు సంబంధించి అధునాతన గేమింగ్ ఫీచర్లు అందించేందుకు ఇందులో 4-కోర్ జీపీయూని ఉపయోగించారు. అంతేకాకుండా మెషిన్ లెర్నింగ్ మోడల్ వేగవంతంగా పనిచేసేందుకు చిప్ 16-కోర్ న్యూరల్ ఇంజిన్, యాపిల్ ఇంటిలిజెన్స్‌ను సపోర్ట్ చేస్తుంది. డిజైన్ పరంగా 6.1 అంగుళాల సూప్ర రెటీనా ఎక్స్‌డీఆర్ ఓఎల్ఈడీ ప్యానెల్‌తో 48ఎంపీ ఫ్యూజన్ కెమరా, 4కె వీడియోలను కూడా క్యాప్చర్ చేస్తుంది. ఇందులో యాక్షన్ బటన్ కూడా ఉంది. ఇది యాపిల్ ఇంటిలిజెన్స్ పవర్డ్ విజువల్ ఇంటిలిజెన్స్ ఫీచర్‌కు యాక్సెస్ అందిస్తుంది. 48 మెగాపిక్సెల్ రిజల్యూషన్‌తో ఒకే ఒక వెనుక కెమెరా ఉన్న మొట్టమొదటి ఐఫోన్ మోడల్ ఇదని కంపెనీ తెలిపింది.

Next Story