ఇకపై ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా కూడా డబ్బులే.. డబ్బులు..!

Instagram stories creators can earn money with this feature.సాధార‌ణంగా మ‌నం ఏటీఎంలోకి వెళ్లి డ‌బ్బులు డ్రా చేస్తే..

By తోట‌ వంశీ కుమార్‌  Published on  4 July 2021 6:05 AM GMT
ఇకపై ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా కూడా డబ్బులే.. డబ్బులు..!

యువత విపరీతంగా ఉపయోగిస్తున్న యాప్స్ లో ఇన్‌స్టాగ్రామ్‌ కూడా ఒకటి..! ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లను కూడా ఇన్‌స్టాగ్రామ్‌ తీసుకుని వస్తోంది. ఒకప్పుడు ఫొటోలు, వీడియోలు మాత్రమే షేర్‌ చేసుకునే ప్లాట్‌ఫాంగా ఉన్న ఇన్‌స్టాగ్రామ్‌లో ఇంకా చాలా మార్పులు చేయబోతున్నారు. ఇన్‌స్టాలో ఇటీవల స్టోరీస్‌, రీల్స్‌, ఫిల్టర్స్‌ ... ఇలా చాలానే వచ్చాయి.ఇలాంటి సరికొత్త ఆప్షన్లు ఇంకా చాలా రాబోతున్నాయి. యూట్యూబ్‌, టిక్‌టాక్‌ లాంటి పోటీదారుల కంటే ఇన్‌స్టాగ్రామ్‌ మరింత బెటర్‌ గా కనిపించనుంది. దీని కోసం క్రియేటర్స్‌, వీడియోస్‌, షాపింగ్‌, మెసేజింగ్ విభాగాలను మరింత పటిష్ఠం చేయనుంది.

ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా డబ్బులు సంపాదించే అవకాశం కూడా వస్తోంది. కొత్త ఫీచర్ పేరు 'ఇన్‌స్టాగ్రామ్‌ ఎక్స్‌క్లూజివ్‌ స్టోరీస్‌' అంటారట..! ఇప్పటికే ఇన్‌స్టాగ్రామ్‌లో స్టోరీస్ ఫీచర్‌ కు మరిన్ని మార్పులు చేసి కొత్త అప్‌డేట్‌ను త్వరలో యూజర్లకు అందిస్తారట. క్రియేటర్ల కు ఇన్‌కమ్‌ వచ్చేలా ఇన్‌స్టాగ్రామ్‌ ఎక్స్‌క్లూజివ్‌ స్టోరీస్‌ ఫీచర్‌ తెస్తోందని సమాచారం. ఈ ఫీచర్‌ అందరికీ అందుబాటులో ఉండదు. ఇన్‌స్టాగ్రామ్‌ నుంచి క్రియేటర్‌ బ్యాడ్జ్‌ సాధించిన వారికి మాత్రమే ఈ ఫీచర్‌ తొలుత ఇవ్వనున్నారు. అలా క్రియేటర్లు రూపొందించిన స్పెషల్‌ కంటెంట్‌ వాళ్ల స్టోరీస్‌, హైలైట్స్‌ కనిపిస్తోంది. దాన్ని క్లిక్‌ చేసి చూడాలంటే ఆ వ్యక్తి క్రియేటర్‌ అకౌంట్‌కు ఫాలో అవ్వడమే కాకుండా మెంబర్ కూడా‌ అయి ఉండాలి. అలా మెంబర్‌షిప్‌ తీసుకున్నవాళ్లకు మాత్రమే ఆ స్టోరీ కనిపిస్తుంది. తొలి రోజుల్లో ఈ మెంబర్‌షిప్‌ ఉచితంగా అందించినా తర్వాత డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఈ ఫీచర్‌ బీటా యూజర్లకు ప్రయోగాత్మకంగా అందుబాటులోకి తీసుకొచ్చారు. త్వరలో లైవ్‌లోకి తీసుకొస్తారని సమాచారం.

Next Story