వంట‌గ్యాస్ వినియోగ‌దారుల‌కు శుభ‌వార్త‌..!

Indian Oil plans Tatkal LPG Seva to deliver cylinders on the day of booking. వినియోగ‌దారులు బుకింగ్ చేసుకున్న రోజే వంట‌గ్యాస్ ఇది వినియోగ‌దారుల‌కు శుభ‌వార్త‌..

By తోట‌ వంశీ కుమార్‌  Published on  13 Jan 2021 4:38 AM GMT
tatkal gas booking

వంట‌గ్యాస్ వినియోగ‌దారులకు శుభ‌వార్త ఇది. గ్యాస్ బుక్‌చేసి సిలిండ‌ర్ కోసం రోజుల త‌ర‌బ‌డి ఎదురుచూడాల్సిన అవ‌స‌రం లేదు. వినియోగ‌దారులు బుకింగ్ చేసుకున్న రోజే వంట‌గ్యాస్ డెలివ‌రీ చేసే విధంగా త‌త్కాల్ సేవ ప్రారంభించ‌డానికి ఇండియ‌న్ ఆయిల్ కార్పొరేష‌న్(ఐఓసీ)స‌న్నాహాలు చేస్తుంది. ఈ పథకం కింద గ్యాస్ బుక్ చేసుకునే వినియోగదారులకు 30 నుంచి 45 నిమిషాల్లోపే సిలిండర్ డెలివరీ చేస్తారు. ఫిబ్రవరి ఒకటి నుంచే తత్కాల్ వంటగ్యాస్ సేవలను ప్రారంభించాలని యోచిస్తున్నట్టు ఐఓసీ అధికారి ఒకరు తెలిపారు.

కేంద్రం నినాద‌మైన సుల‌భ‌త‌ర జీవ‌నం మెరుగ‌ప‌ర‌చ‌డంలో భాగంగా అందించ‌నున్న ఈ సేవ‌ల‌ను ఇంకా ఖ‌రారు చేయాల్సి ఉంది. ఇండేన్ బ్రాండ్ ద్వారా వంటగ్యాస్ సేవలను అందిస్తున్న ఐవోసీకి దేశవ్యాప్తంగా 14 కోట్ల మంది వినియోగదారులు ఉన్నారు. తత్కాల్ సేవలను ప్రారంభించేందుకు తొలుత ప్రతి రాష్ట్రం, కేంద్ర పాలిత ప్రాంతంలోని ఒక నగరం, లేదంటే జిల్లాను ఎంపిక చేసుకోనున్నట్టు సమాచారం. ఈ సేవలకు సంబంధించిన విధివిధానాలను ఖరారు చేయాల్సి ఉంది.


Next Story