క్రెడిట్ కార్డు పరిమితి పెంచుకోవాలా?
అత్యవసరాల్లో డబ్బు కావాల్సినప్పుడు క్రెడిట్ కార్డు ఎంతో ఉపయోగపడుతుంది. దీన్ని బాధ్యతాయుతంగా ఉపయోగించుకోవడం వల్ల అనేక ప్రయోజనాలు కూడా ఉంటాయి.
By అంజి Published on 16 Sep 2024 8:15 AM GMTక్రెడిట్ కార్డు పరిమితి పెంచుకోవాలా?
అత్యవసరాల్లో డబ్బు కావాల్సినప్పుడు క్రెడిట్ కార్డు ఎంతో ఉపయోగపడుతుంది. దీన్ని బాధ్యతాయుతంగా ఉపయోగించుకోవడం వల్ల అనేక ప్రయోజనాలు కూడా ఉంటాయి. అయితే క్రెడిట్ కార్డుపై పరిమితి ఉండటం వల్ల కొందరు తమకు కావాల్సినంత డబ్బును తీసుకోలేరు. మరి క్రెడిట్ కార్డు పరిమితిని ఎలా పెంచుకోవాలి? ఇప్పుడు తెలుసుకుందాం..
మెరుగైన క్రెడిట్ స్కోర్
అధిక రుణం పొందాలన్నా, లోన్ త్వరగా రావాలన్నా మెరుగైన క్రెడిట్ స్కోర్ అవసరం. అలాగే మీ బ్యాంకు మీ క్రెడిట్ కార్డు పరిమితిని పెంచాలంటే కూడా మంచి క్రెడిట్ స్కోర్ కావాలి. మీరు ఇప్పటి వరకు క్రెడిట్ పరిమితిని నిర్వహించిన విధానాన్ని సమీక్షించిన తర్వాత.. బ్యాంకు అధికారులు ముఖ్యంగా గమనించేది ఈ క్రెడిట్ స్కోర్‌నే. కాబట్టి.. మీ ఆదాయాలు, చెల్లింపులు, ఇతర ఆర్థిక వనరులతో పాటు క్రెడిట్ స్కోర్‌ను చూపించి పరిమితిని పెంచమని కోరవచ్చు.
మరొక కార్డు
కొన్నిసార్లు మీ బ్యాంకులు పరిమితిని పెంచకపోవచ్చు. అలాంటి సమమయంలో మీరు మరో కార్డు పొందడం ఉత్తమం. మీ క్రెడిట్ స్కోర్ మెరుగ్గా ఉంటే మరో కార్డు జారీ చేయడానికి ఏ బ్యాంకు కూడా విముఖత చూపదు. అయితే ఈ సారి క్రెడిట్ కార్డును ఎంచుకునే ముందు పరిమితి ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. అలాగే.. ఏక కాలంలో రెండు క్రెడిట్ కార్డులను వాడేటప్పుడు వాటిని సమర్థంగా వినియోగించుకోవాలి. లేకపోతే ఒక కార్డు వల్ల మరో కార్డుకు ఎఫెక్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి.
ఇలా చేయకండి
పరిమితి ఉంది కదా అని.. అవసరం లేకుండానే పూర్తి మొత్తాన్ని వినియోగించుకోకూఊడదు. మొత్తం క్రెడిట్ పరిమితిలో కనీసం 30 శాతం అలాగే ఉంచుకోవాలి. మిగితాది అత్యవసర సమయాల్లో వాడుకోవచ్చు. కొంత మొత్తాన్ని మిగల్చడం ద్వారా క్రెడిట్ స్కోర్ మెరుగుపడుతుంది. క్రెడిట్ కార్డును వినియోగించుకోకుండా వదిలేస్తే కార్డుపై ఆధారపడనివారికి పరిమితి పెంచి ఏం ఉపయోగం? అని బ్యాంకు అధికారులు అనుకుంటారు. పరిమితి పెరిగితే లాభాలు కూడా ఉంటాయి. అధిక రివార్డులు, ప్రయోజనాలు లభిస్తాయి.