రోజుకు రూ.20 సేవ్‌ చేస్తే లక్షాధికారి.. అదే రూ.120 సేవ్‌ చేస్తే కోటీశ్వరులూ అవ్వొచ్చు.. ఎలాగంటే?

మీరు రోజుకు కేవలం రూ.20 పొదుపు చేయడం ద్వారా లక్షాధికారిగా మారొచ్చని మీకు తెలుసా? కేవలం రూ.20లతో లక్షాధికారి అంటే..

By -  అంజి
Published on : 10 Oct 2025 10:26 AM IST

120 rupees, millionaire, Business, Invest

రోజుకు రూ.20 సేవ్‌ చేస్తే లక్షాధికారి.. అదే రూ.120 సేవ్‌ చేస్తే కోటీశ్వరులూ అవ్వొచ్చు.. ఎలాగంటే?

మీరు రోజుకు కేవలం రూ.20 పొదుపు చేయడం ద్వారా లక్షాధికారిగా మారొచ్చని మీకు తెలుసా? కేవలం రూ.20లతో లక్షాధికారి అంటే.. ఇది కచ్చితంగా బెట్టింగ్, ఫ్రాడ్‌ లేదా లక్‌ వల్ల సాధ్యమవుతుందని అనుకుంటున్నారేమో కానీ, కాదు. మీరు కొద్దిగా క్రమశిక్షణ పాటించి రోజుకు రూ.20 సేవ్‌ చేయగలిగితే కచ్చితంగా లక్షాధికారి అవుతారు. అదెలా సాధ్యమో ఇప్పుడు తెలుసుకుందాం..

అప్పు చేసి తీర్చకపోతే.. ఇంకా అప్పుల్లో కూరుకుపోతాం. అందుకు కారణం వడ్డీ. దానిపై ఉండే చక్రవడ్డీ. అయితే ఈ సూత్రం కేవలం అప్పులకు మాత్రమే కాదు, పొదుపుకు కూడా వర్తిస్తుంది. మనం క్రమంగా పెట్టే పెట్టుబడులు మనకొచ్చే డబ్బును పెంచుకుంటూ పోతాయి. ఇది చక్రవడ్డీకి ఉన్న పవర్. అందుకే దీన్ని వినియోగించుకోవాలని చెబుతుంటారు. మరి, ఈ చక్రవడ్డీ వల్ల రూ.20 ఎలా రూ.10 లక్షలుగా మారుతాయో ఇప్పుడు తెలుసుకుందాం..

రోజుకు రూ.20 సేవ్‌ చేస్తే ఏం లాభం ఉంటుంది అని అనుకుంటున్నారమో? కానీ అదే రూ.20 నెలకు రూ.600 అవుతుంది. ఏడాదికి రూ.7,200 అవుతుంది. పదేళ్లకు రూ.72,000 అవుతుంది. పాతికేళ్లకు రూ.1.8 లక్షలు అవుతుంది. ఇది కేవలం పొదుపు ముచ్చటే మరి ఇంత అమౌంట్‌ను ఒకవేళ ఇన్వెస్ట్‌ చేస్తే? తెలివిగా పెట్టుబడులు పెడితే? ఆ డబ్బు ఎంత అవుతుందో ఊహించగలరా? కనీసం 12 శాతం రాబడి లెక్కించినా.. ఏడాదికి మీ పొదుపు రూ.7,660 అవుతుంది. 8 ఏళ్లకే రూ.1 లక్ష దాటుతుంది. పదేళ్లకు రూ.1.35 లక్షలు మీ సొంతం అవుతాయి.

పాతికేళ్ల వరకు పెట్టుబడులను ఇలాగే కొనసాగిస్తే.. మీరు రూ.10 లక్షలు పొందవచ్చు. అంటే మీ పెట్టుబడికి దాదాపు 8 రెట్లు ఎక్కువ డబ్బు చక్ర వడ్డీ వల్ల పెరుగుతుంది. మీరు ఇన్వెస్ట్‌ చేసే అమౌంట్‌ పెంచుకుంటే.. మీకొచ్చే ఆదాయం కూడా అంతే పెద్ద మొత్తంలో పెరుగుతుంది. రూ.1 కోటి కావాలని అనుకుంటే.. రోజుకు రూ.120 సేవ్ చేస్తే చాలు. 15 శాతం రాబడితో పాతికేళ్లలో ఆ డబ్బు మీ సొంతం అవుతుంది. ఆ టెన్యూర్‌ తగ్గాలంటే.. మీరు పొదుపు పెంచుకోవాలి.

Next Story