దీపావళి మరుసటి రోజే షాక్.. భారీగా పెరిగిన సిలిండర్‌ ధర

దీపావళి తర్వాత ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీలు ప్రజలు షాక్‌ ఇచ్చాయి. నవంబర్ 1, 2024 నుండి 19 కిలోల వాణిజ్య ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధరను పెంచుతున్నట్లు ప్రభుత్వ చమురు కంపెనీలు ప్రకటించాయి.

By అంజి  Published on  1 Nov 2024 7:57 AM IST
commercial gas cylinder, gas cylinder price, Oil companies

దీపావళి మరుసటి రోజే షాక్.. భారీగా పెరిగిన సిలిండర్‌ ధర

దీపావళి తర్వాత ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీలు ప్రజలు షాక్‌ ఇచ్చాయి. నవంబర్ 1, 2024 నుండి 19 కిలోల వాణిజ్య ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధరను పెంచుతున్నట్లు ప్రభుత్వ చమురు కంపెనీలు ప్రకటించాయి. కమర్షియల్‌ గ్యాస్‌ సిలిండర్‌ ధరలను రూ.62 మేర పెంచాయి. దీంతో ప్రస్తుతం హైదరాబాద్‌లో కమర్షియల్‌ ఎల్పీజీ ధర రూ.2,028కి చేరింది. నేటి నుంచి కొత్త రేట్లు అమల్లోకి వచ్చాయి. మరోవైపు 14.2 కిలోల డొమెస్టిక్‌ సిలిండర్‌ ధరల్లో ఎలాంటి మార్పులు చేయలేదు. కాగా ప్రతి నెలా ఒకటో తేదీన సిలిండర్‌ ధరల్లో ఆయిల్‌ కంపెనీలు మార్పులు చేస్తాయి.

పండుగలు, పెళ్లిళ్లు ప్రారంభం కావడంతో ప్రభుత్వ చమురు కంపెనీలు వాణిజ్య ఎల్‌పీజీ సిలిండర్ల ధరలను పెంచాయి. నవంబర్ 1, 2024 నుండి, ఢిల్లీలో 19 కిలోల కమర్షియల్ సిలిండర్ ధర గతంలో రూ.1740గా ఉన్న సిలిండర్ ధర రూ.62 పెరిగి రూ.1802కి చేరింది. నెల ప్రారంభంలో ధరల ఈ సమీక్ష రెస్టారెంట్లు, హోటళ్లు.. వాణిజ్య గ్యాస్ సిలిండర్లు అవసరమయ్యే అనేక చిన్న వ్యాపారాలపై ద్రవ్యోల్బణ ఒత్తిడిని పెంచింది.

దీపావళి తర్వాత, దేశంలో వాణిజ్య గ్యాస్ సిలిండర్ల ధరలు వరుసగా నాలుగో నెలలో పెరిగాయి. ఈసారి ధరలను రూ.62 పెంచారు. గత నాలుగు నెలల్లో సిలిండర్‌పై సగటున రూ. 156 పెరిగింది, హోటళ్లు, రెస్టారెంట్లు , చిన్న వ్యాపారాలపై అదనపు భారాన్ని మోపింది. పండుగ, పెళ్లిళ్ల సీజన్‌లో నాలుగు మహానగరాల్లో ధరలు పెరగడం వ్యాపారులకు ఆందోళన కలిగించే అంశంగా మారింది.

ప్రధాన నగరాల్లో 19 కేజీల LPG గ్యాస్ ధరలు

ఢిల్లీ: రూ.1740 నుంచి రూ.1802కి పెరిగింది

కోల్‌కతా: రూ.1850 నుంచి రూ.1911.50కి పెరిగింది

ముంబై: రూ.1692.50 నుంచి రూ.1754.50కి పెరిగింది

చెన్నై: రూ.1903 నుంచి రూ.1964.50కి పెరిగింది.

హైదరాబాద్‌లో కమర్షియల్‌ గ్యాస్‌ సిలిండర్‌ ధర రూ. 2028కి చేరింది.

విజయవాడలో కమర్షియల్‌ గ్యాస్‌ సిలిండర్‌ ధర రూ. 1962కి చేరింది.

Next Story