పీఎఫ్ సొమ్మును విత్‌డ్రా చేసుకోవడం ఎలా?
ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులందరికీ పీఎఫ్ ఖాతా ఉంటుందన్న విషయం తెలిసిందే. ఈ పీఎఫ్ ఖాతాలోకి ప్రతినెలా కొంత డబ్బు కూడా జమ అవుతూ ఉంటుంది.
By అంజి Published on 15 Dec 2024 7:45 AM GMTపీఎఫ్ సొమ్మును విత్‌డ్రా చేసుకోవడం ఎలా?
ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులందరికీ పీఎఫ్ ఖాతా ఉంటుందన్న విషయం తెలిసిందే. ఈ పీఎఫ్ ఖాతాలోకి ప్రతినెలా కొంత డబ్బు కూడా జమ అవుతూ ఉంటుంది. అయితే అనుకోని సమస్యలు వచ్చినప్పుడు ఆ డబ్బును మనం విత్‌డ్రా చేసుకోవచ్చు. ఇందుకోసం పీఎఫ్ ఖాతాకు సంబంధించిన యూఏఎన్ (యూనివర్సల్ అకౌంట్ నంబర్) మన దగ్గర ఉండాలి. ఆధార్ కార్డు వివరాలు పీఎఫ్ ఖాతాతో నమోదు చేసి ఉండాలి. అలాగే బ్యాంక్ ఖాతా వివరాలు కూడా కావాలి. మనీ విత్ డ్రా కోసం ముందుగా యూఏఎన్ నంబర్, పాస్ వర్డ్ ఉపయోగించి ఈపీఎఫ్‌వో వెబ్‌సైట్‌లో లాగిన్ అవ్వాలి. ఆ తర్వాత ఆన్‌లైన్‌లో క్లెయిమ్ ఫారంను పూరించి, విత్‌డ్రా చేయాలనుకునే కారణాన్ని ఎంచుకోవాలి. అవసరమైన డాక్యుమెంట్లను అప్‌లోడ్ చేసి, దరఖాస్తును సబ్మిట్ చేయాలి. ఆ దరఖాస్తును ఈపీఎఫ్ అధికారులు పరిశీలిస్తారు. అన్ని వివరాలు సరిగ్గా ఉంటే దరఖాస్తును ఆమోదిస్తారు. ఆ తర్వాత పీఎఫ్ డబ్బులు బ్యాంక్ ఖాతాలోకి జమ అవుతాయి.
కొన్ని అవసరాలకు మాత్రమే
కొన్ని అవసరాలకు మాత్రమే పీఎఫ్ డబ్బును విత్‌డ్రా చేసుకోవడానికి వీలు ఉంటుంది. చందాదారునికి లేదా తన కుటుంబ సభ్యులకు వైద్యం కోసం అత్యవసరంగా డబ్బు కావాల్సి వస్తే.. పీఎఫ్ డబ్బులు విత్‌డ్రా చేసుకోవచ్చు. ఇల్లు కొనుగోలు లేదా నిర్మాణం కోసం మనీ విత్ డ్రా చేసుకోవచ్చు. చందాదారుడు తన పెళ్లి కోసం కూడా పీఎఫ్ డబ్బును క్లెయిమ్ చేసుకోవచ్చు. పిల్లల చదువు లేదా వివాహం కోసం కూడా పీఎఫ్ సొమ్మను ఉపసంహరణకు అనుమతి ఇస్తారు.
ఇటీవల పీఎఫ్ క్లెయిమ్ సెటిల్‌మెంట్ సమయాన్ని తగ్గించారు. కాబట్టి 3 రోజుల్లోనే అకౌంట్లోకి డబ్బులు పడతాయి. గరిష్ఠంగా పదిరోజులు కూడా పట్టొచ్చు. అయితే, పైన తెలిపిన కారణాలకు పీఎఫ్ ఖాతాలో ఉన్న మొత్తం డబ్బును చెల్లించరు. కేవలం పాక్షికంగా మాత్రమే విత్‌డ్రా చేసుకోవచ్చు. పదవీ విరమణకు రెండు నెలల ముందు మాత్రమే మొత్తం డబ్బును క్లెయిమ్ చేసుకోవడానికి వీలు ఉంటుంది. ఎక్కువ కాలం నిరుద్యోగిగా ఉన్న పీఎఫ్ మొత్తాన్ని విత్‌డ్రా చేసుకోవచ్చు. ఉద్యోగంలో ఉంటూ.. మనీ మొత్తాన్ని విత్ డ్రా చేసుకోవచ్చు.