ఫ్రీగా ఇన్‌స్టంట్‌ ఈ పాన్‌ కార్డ్.. చాలా ఈజీ గురూ

ఆధునికత కొత్త పుంతలు తొక్కుతున్నా నేటికీ గ్రామాల్లో కనీసం బ్యాంక్‌ అకౌంట్‌ లేని వారు తారస పడుతుంటారు. దీనికి పాన్‌కార్డ్‌ లేకపోవడం కూడా ఒక కారణంగా చెప్పొచ్చు.

By అంజి  Published on  30 April 2024 10:30 AM IST
PAN card , instant PAN card, Income tax

ఫ్రీగా ఇన్‌స్టంట్‌ ఈ పాన్‌ కార్డ్.. చాలా ఈజీ గురూ

ఆధునికత కొత్త పుంతలు తొక్కుతున్నా నేటికీ గ్రామాల్లో కనీసం బ్యాంక్‌ అకౌంట్‌ లేని వారు తారస పడుతుంటారు. దీనికి పాన్‌కార్డ్‌ లేకపోవడం కూడా ఒక కారణంగా చెప్పొచ్చు. చాలా మందికి అత్యవసరంగా బ్యాంక్‌ అకౌంట్‌ తీసుకోవాల్సి రావొచ్చు. ఇలాంటి సందర్భాల్లో సులభంగా అదీ ఉచితంగా ఈ-పాన్‌కార్డ్‌ పొందవచ్చు. అయితే ఇది ఇంతకుముందు పాన్‌ కార్డ్‌ ఉన్నవారికి వర్తించదు. కొత్తగా తీసుకోవాలనుకునే వారికి మాత్రమే. దీని కోసం ఇలా సులభంగా దరఖాస్తు చేసుకోండి..

- ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ డిపార్ట్‌మెంట్‌ పోర్టల్‌లోకి వెళ్లాలి.

- టాప్‌లో ఎడమవైపు క్విక్‌ లింక్స్‌ సెక్షన్‌లో ఇన్‌ స్టంట్‌ ఈ -పాన్‌ అనే ఆప్షన్‌పై క్లిక్‌ చేయాలి. తర్వాత గెట్‌ న్యూ ఈ-పాన్‌ ఆప్షన్‌ ఎంచుకుని ఆధార్‌ నంబర్‌ ఇచ్చాక పర్సనల్‌ డీటెయిల్స్‌ వస్తాయి. అన్నీ సరిచూసుకుని చెక్‌ బాక్స్‌ను ఎంచుకుని కంటిన్యూపై క్లిక్‌ చేయాలి.

- దరఖాస్తు పూర్తయ్యాక అక్నాలడ్జ్‌మెంట్‌ నంబర్‌ వస్తుంది. కన్ఫర్మేషన్‌ మెసేజ్‌ రాగానే GET New e-pan ఆప్షన్లు వస్తాయి. ఇక్కడి నుంచి ఈ-పాన్‌ కార్డ్‌ డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.

Next Story