అనంత్ అంబానీ-రాధిక మర్చంట్ వివాహ వేడుకలకు హాజరయ్యే ప్రముఖులు ఎవరో తెలుసా.?

అంబానీ కుటుంబంలో మరో పెళ్లి సందడి మొదలైంది. ముకేశ్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ, రాధికా మర్చంట్‌ను జూలైలో ముంబైలో వివాహం చేసుకోనున్న

By Medi Samrat  Published on  22 Feb 2024 2:30 PM GMT
అనంత్ అంబానీ-రాధిక మర్చంట్ వివాహ వేడుకలకు హాజరయ్యే ప్రముఖులు ఎవరో తెలుసా.?

అంబానీ కుటుంబంలో మరో పెళ్లి సందడి మొదలైంది. ముకేశ్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ, రాధికా మర్చంట్‌ను జూలైలో ముంబైలో వివాహం చేసుకోనున్న నేపథ్యంలో ప్రీ వెడ్డింగ్ ఉత్సవాలను నిర్వహించనున్నారు. గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో మార్చి 1 నుండి మార్చి 3 వరకు జరుగుతాయి, ఈ ఈవెంట్ కోసం చాలా మంది ప్రపంచ ప్రఖ్యాత అతిథులు హాజరవుతున్నారు. జామ్‌నగర్‌లో అనంత్ అంబానీ, రాధికా మర్చంట్‌ల రాబోయే ప్రీ వెడ్డింగ్ ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతాయని అంచనా వేస్తున్నారు. రిలయన్స్ టౌన్‌షిప్‌లో జరిగే వేడుకలకు 1,200 మంది అతిథులు హాజరుకానున్నారు. ఈ ఈవెంట్‌లో ఎంతో మంది కళాకారులచే అబ్బురపరిచే ప్రదర్శనలు ఉండనున్నాయి.

పలు రిపోర్టుల ఆధారంగా ఈ ప్రీ వెడ్డింగ్ బ్యాష్ కు హాజరయ్యే ప్రముఖులు వీరే:

బిల్ గేట్స్: మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు.

మార్క్ జుకర్‌బర్గ్: మెటా CEO.

లారీ ఫింక్: బ్లాక్‌రాక్ యొక్క CEO.

స్టీఫెన్ స్క్వార్జ్‌మాన్: బ్లాక్‌స్టోన్ ఛైర్మన్.

బాబ్ ఇగర్: డిస్నీ మాజీ CEO.

ఇవాంకా ట్రంప్: వ్యాపారవేత్త, మాజీ వైట్ హౌస్ సలహాదారు.

టెడ్ పిక్: మోర్గాన్ స్టాన్లీ CEO.

బ్రియాన్ థామస్ మొయినిహాన్: బ్యాంక్ ఆఫ్ అమెరికా ఛైర్మన్.

మహ్మద్ బిన్ అబ్దుల్రహ్మాన్ బిన్ జాసిమ్ అల్ థానీ: ఖతార్ ప్రధాన మంత్రి.

సుల్తాన్ అహ్మద్ అల్ జాబర్: అడ్నోక్ CEO.

భూటాన్ రాజు, రాణి: రాజ ప్రముఖులు.

యూరి మిల్నర్: టెక్ పెట్టుబడిదారు.

శంతను నారాయణ్: అడోబ్ CEO.

థామస్ బరాక్: కాలనీ క్యాపిటల్ ఛైర్మన్ & వ్యవస్థాపకుడు

కార్ల్ బిల్ట్: స్వీడన్ మాజీ ప్రధాన మంత్రి

జే లీ: ఎగ్జిక్యూటివ్ చైర్మన్, శాంసంగ్ ఎలక్ట్రానిక్స్

రేమండ్ డాలియో: రేమండ్ వ్యవస్థాపకుడు

హార్పర్: కెనడా మాజీ ప్రధాని

డోనాల్డ్ హారిసన్: ప్రెసిడెంట్, గూగుల్

Next Story