మార్కెట్‌లో బెస్ట్ టాప్ 5 చిన్న కార్లు ఇవే
మన మార్కెట్లో ఖరీదైన కార్ల కంటే సరసమైన ధరలో మంచి ఫీచర్స్ ఉండి, తగినంత మైలేజీ వచ్చే కార్లకు గిరాకీ ఎక్కువ. రోజు రోజుకూ కొత్త కొత్త కార్లు
By అంజి Published on 29 May 2023 5:01 AM GMTమార్కెట్‌లో బెస్ట్ టాప్ 5 చిన్న కార్లు ఇవే
మన మార్కెట్లో ఖరీదైన కార్ల కంటే సరసమైన ధరలో మంచి ఫీచర్స్ ఉండి, తగినంత మైలేజీ వచ్చే కార్లకు గిరాకీ ఎక్కువ. రోజు రోజుకూ కొత్త కొత్త కార్లు మార్కెట్‌లోకి వస్తున్నప్పటికీ.. కొన్ని చిన్న కార్లు మాత్రం గ్రామీణ మార్కెట్‌లో తమ సత్తా చాటుతూనే ఉన్నాయి. అలాంటి టాప్ ఐదు కార్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
మారుతి ఎస్ ప్రెస్సో: మారుతి సుజుకి నుంచి వచ్చిన ఈ కారు ధర రూ.4.25 లక్షల నుంచి రూ.6.1 లక్షలు. ఇందులోని కె10బి పెట్రోల్ ఇంజిన్ ఆటోమెటిక్, మాన్యువల్ ట్రాన్స్మిషన్ పొందుతుంది. ఆకర్షణీయమైన డిజైన్, మంచి ఫీచర్స్ ఉన్న ఈ కారు లీటరుకు 24.8 కి.మీ నుండి 32.7 కి.మీ మైలేజ్ అందిస్తుంది.
బజాజ్ క్యూట్: గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో మంచి డిమాండ్ ఉన్న కారు. సామాన్యులకు అందుబాటులో ఉండే ధర (రూ.2.64 నుంచి 2.84 లక్షలు), 35 - 45 కి.మీ మైలేజ్ దీని ప్రత్యేకతలు. 216 సీసీ ఇంజిన్ సామర్థ్యం, సైజు చిన్నదైనా.. ముచ్చటైన డిజైన్, మంచి ఫీచర్స్ దీని ఆకర్షణలు.
డాట్సన్ రెడీ గో: ఫోర్డ్ కంపెనీకి చెందిన డాట్సన్ రెడీ గో కారు లీటర్‌కు 20.7 కి.మీ నుంచి 22 కి.మీ మైలేజ్ అందిస్తోంది. దీని ధర రూ.3.8 లక్షల నుంచి రూ.4.96 లక్షల మధ్యలో ఉంది. 799 సీసీ ఇంజిన్ కెపాసిటీ గల ఈ కారు ఉత్పత్తి ఇప్పుడు దేశీయంగా ఆగినా, విక్రయాలు మాత్రం సాగుతూనే ఉన్నాయి.
రెనాల్ట్ క్విడ్: సరసమైన ధర, సురక్షితమైన కార్ల జాబితాలో ఇదీ ఒకటి. దీని ధర రూ.4.7 లక్షల నుంచి రూ.6.33 లక్షల మధ్య ఉంది. లీటరుకు 22 నుంచి 23 కి.మీ మైలేజ్ ఇస్తుంది. సైజు చిన్నదైనా డిజైన్, ఫీచర్స్ పరంగా బాగుంటుంది. 799 సీసీ ఇంజిన్ కెపాసిటీ గల ఈ కారు సేల్స్ పరంగా దూసుకెళ్తూనే ఉంది.
మారుతి ఆల్టో 800: ఒకప్పుడు మార్కెట్‌ను ఒక ఊపు ఊపిన ఈ కారు ఆధునిక ఫీచర్లతో మళ్లీ జనాదరణ పొందుతోంది. ధర రూ.3.5 లక్షల నుంచి రూ.5.13 లక్షలు. 796 సీసీ ఇంజిన్ కెపాసిటీ గల ఈ కారు లీటరుకు 24.7 నుంచి 31.4 కి.మీ మైలేజ్ ఇస్తుంది.