జాయింట్ హోంలోన్‌తో కలిగే పన్ను ప్రయోజనాలు ఇవే
భార్య భర్తలు కలిసి జాయింట్ హోంలోన్‌ను తీసుకుంటే ఎన్నో లాభాలు ఉంటాయి.
By అంజి
జాయింట్ హోంలోన్‌తో కలిగే పన్ను ప్రయోజనాలు ఇవే
భార్య భర్తలు కలిసి జాయింట్ హోంలోన్‌ను తీసుకుంటే ఎన్నో లాభాలు ఉంటాయి. ముఖ్యంగా ఇద్దరూ సంపాదనాపరులే అయితే, బ్యాంకులు వీలైనంత ఎక్కువ రుణాన్ని మంజూరు చేసే అవకాశం ఉంటుంది. దీనికి సంబంధించిన ఈఎంఐను భార్యభర్తలు చెరి సగం లేదా వారి వేతనాలకు అనుగుణంగా చెల్లించుకోవచ్చు. ఈ విషయంలో ఇద్దరూ కలిసికట్టుగా ప్లాన్ చేసుకోవాలి.
కలిసి హోంలోన్ తీసుకున్నారు కాబట్టి ఇద్దరు వేర్వేరుగా పన్ను ప్రయోజనాలను క్లెయిమ్ చేసుకోవచ్చు. దీని వల్ల పన్ను ప్రయోజనాలు రెట్టింపు అవుతాయి. ఇద్దరూ హోంలోన్ తీర్చే క్రమంలో ఒక ఆర్థిక సంవత్సరం వ్యవధిలో చెల్లించిన అసలులో రూ.1.50 లక్షల వరకు ఆదాయపు పన్ను (ఐటీ) చట్టంలోని సెక్షన్ 80సీ కింద క్లెయిమ్ చేసుకోవచ్చు.
ఒక ఆర్థిక సంవత్సరం వ్యవధిలో దంపతులు చెల్లించిన వడ్డీలో రూ.2 లక్షల వరకు ఐటీ చట్టంలోని సెక్షన్ 24బీ కింద క్లెయిమ్ చేయొచ్చు. ఒకవేళ మహిళ ప్రధాన రుణగ్రహీతగా ఉంటే లోన్‌పై సగటున 0.05 శాతం నుంచి 0.1 శాతం వరకు వడ్డీరేటును తగ్గిస్తారు. కొన్ని రాష్ట్రాల్లో మహిళలకు స్టాంప్ డ్యూటీలో తగ్గింపును ఆఫర్ చేస్తున్నారు. దీని వల్ల ఆస్తి కొనుగోలు వ్యయం బాగా తగ్గుతుంది. కాబట్టి వీటి గురించి ముందుగా ఎంక్వైరీ చేసుకోవాలి.