హోంలోన్ Vs మార్టగేజ్ లోన్.. మధ్య తేడాలు ఇవే
ప్రతి ఒక్కరికీ సొంతిల్లు ఉండాలనేది కల. చాలా మంది తమ కలలను సాకారం చేసుకోవడానికి హోం లోన్‌ను ఆశ్రయిస్తారు. వాటిల్లో చాలా రకాలు ఉన్నాయి.
By అంజి
హోంలోన్ Vs మార్టగేజ్ లోన్.. మధ్య తేడాలు ఇవే
ప్రతి ఒక్కరికీ సొంతిల్లు ఉండాలనేది కల. చాలా మంది తమ కలలను సాకారం చేసుకోవడానికి హోం లోన్‌ను ఆశ్రయిస్తారు. వాటిల్లో చాలా రకాలు ఉన్నాయి. మన అవసరాన్ని బట్టి వీటిలో ఏదో ఒకదాన్ని మనం ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. చాలా మంది వీటి మధ్య తేడా తెలియక గందరగోళపడుతూ ఉంటారు. లేదంటే.. బ్యాంకర్లు చెప్పిన సలహాను విని ముందుకు వెళుతుంటారు. ఇప్పుడు హోంలోన్, మార్టగేజ్ లోన్‌ల మధ్య ఉన్న తేడాను తెలుసుకుందాం..
హోంలోన్: నిర్మాణం పూర్తయిన ఇళ్లు కొనడానికి లేదా కొత్త ఇంటిని నిర్మించేందుకు మాత్రమే హోంలోన్‌ను మంజూరు చేస్తారు. రుణ దాతలు ఆ ఇంటినే తనఖా కింద పెట్టుకుంటారు. ఒక వేళ మనం రుణం తిరిగి చెల్లించడంలో విఫలం అయితే.. ఇంటిని స్వాధీనపరుచుకుని సొమ్మును రికవరీ చేసుకుంటారు..
హోంలోన్ ఫీచర్లు: హోంలోన్‌ను ఇంటి నిర్మాణం లేదా కొనుగోలుకు మాత్రమే వినియోగించాలి. ఇంటిని నిర్మిస్తున్న ప్రాంతంలో ఉన్న మార్కెట్ విలువలో 90 శాతం మొత్తాన్ని రుణం రూపంలో పొందవచ్చు. మార్టగేజ్ లోన్‌తో పోలిస్తే హోంలోన్‌లో వడ్డీరేటు తక్కువ. హోంలోన్‌లో ప్రాసెసింగ్ రుసుము 0.8 నుంచి 1.2 శాతం మధ్య ఉంటుంది. అలాగే దాదాపు 30 ఏళ్ల వరకు హోంలోన్‌ను తిరిగి చెల్లించే వెసులుబాటు ఉంటుంది.
మార్టగేజ్ లోన్: ఏదైనా ఆస్తిని తనఖా పెట్టి రుణం తీసుకుంటే దాన్ని మార్టగేజ్ లోన్ అంటారు. ఇలా మంజూరైన సొమ్మును దేనికైనా వినియోగించుకోవచ్చు. రుణం తిరిగి చెల్లించడంలో విఫలం అయితే.. తనఖా పెట్టిన ఆస్తిని విక్రయించి రుణాన్ని రికవరీ చేసుకుంటారు.
మార్టగేజ్ లోన్ ఫీచర్లు: మార్టగేజ్ లోన్ వినియోగంపై ఎలాంటి పరిమితి ఉండదు. కావాలంటే రుణగ్రహీత తన వ్యక్తిగత అవసరాలకు కూడా సొమ్మును వాడుకోవచ్చు. హోంలోన్‌తో పోలిస్తే మార్టగేజ్‌లో మంజూరుయ్యే రుణం తక్కువగా ఉంటుంది. ఆస్తి విలువలో 60 నుంచి 70 శాతం మాత్రమే రుణ రూపంలో పొందవచ్చు. హోంలోన్‌తో పోలిస్తే మార్టగేజ్ లోన్‌పై 1 - 3 శాతం వడ్డీరేటు ఎక్కువగా ఉంటుంది. మార్టగేజ్ లోన్‌లో ప్రాసెసింగ్ రుసుము 1.5 శాతం వరకు ఉంటుంది. ఈ లోన్ తిరిగి చెల్లించడానికి గరిష్టంగా 15 ఏళ్ల కాల పరిమితి మాత్రమే ఉంటుంది. ఎలాంటి పేపర్ వర్క్ లేకుండానే ఉన్న లోన్‌పై టాప్ అప్ లోన్ తీసుకునే వెసులుబాటు ఇందులో ఉంటుంది.