కార్లు కొనుగోలు చేసేవారి సంఖ్య గణనీయంగా పెరిగిపోయింది. ప్రకృతి పరిరక్షణలో భాగంగా చాలా మంది ఎలక్ట్రిక్ కార్లు కొనుగోలు చేస్తున్నారు. మరి మీరు కూడా కొత్త కారు తీసుకోవాలి అనుకుంటున్నారా? రూ.10 లక్షలు అంతకంటే తక్కువ ధరల్లో ఉండే ఎలక్ట్రిక్ కార్లు ఏమేం ఉన్నాయో ఇప్పుడు చూసేద్దామా?
1. టాటా టియాగో ఈవీ
ఈ కారు ధర రూ.8 లక్షల నుంచి (ఎక్స్ - షోరూమ్) ప్రారంభమవుతుంది. టాప్ వేరియంట్ ధర రూ.11.5 లక్షలుగా ఉంది. బ్యాటరీ ఫుల్ చేస్తే.. 275 కిలోమీటర్ల వరకు వెళ్లవచ్చు. సున్నా నుంచి 60 కిలోమీటర్ల వేగానికి చేరుకోవడానికి 5.7 సెకన్ల సమయం పడుతుంది.
2. టాటా పంచ్ ఈవీ
ఈ కారు ధర రూ.10 లక్షల నుంచి స్టార్ట్ అవుతుంది. స్మార్ట్ ప్లస్ వేరియంట్ ధర రూ.11 లక్షలుగా ఉంది. అడ్వెంచర్, అడ్వెంచర్ ($) ఆపై వేరియంట్ ధరలు రూ.11.7 లక్షల నుంచి రూ.14.30 లక్షల వరకు ఉన్నాయి. ఈ కారు 0 నుంచి 10 కిలోమీటర్ల వేగానికి చేరుకోవడానికి 9.5 సెకన్లు పడుతుంది.
3. MG Comet EV: ఈ చిన్న ఎలక్ట్రిక్ కారు ధర రూ.7 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. టాప్ వేరియంట్ కూడా రూ.10 లక్షల లోపే ఉంది. ఈ ఈవీ పూర్తిగా ఛార్జ్ చేస్తే 230 కిలోమీటర్ల వరకు డ్రైవింగ్ పరిధిని పొందుతారు.