యాడ్‌ ఆన్‌ క్రెడిట్‌ కార్డు గురించి తెలుసా?

ప్రస్తుతం చాలా మంది క్రెడిట్‌ కార్డులను ఉపయోగిస్తున్నారు. కొందరు సక్రమంగా బిల్లులు చెల్లిస్తూ.. మంచి క్రెడిట్‌ స్కోర్‌ను మెయింటెన్‌ చేస్తున్నారు.

By అంజి  Published on  5 Nov 2024 4:45 AM GMT
Add On Credit Card, Credit Card, Credit Card Uses, Bank

యాడ్‌ ఆన్‌ క్రెడిట్‌ కార్డు గురించి తెలుసా?

ప్రస్తుతం చాలా మంది క్రెడిట్‌ కార్డులను ఉపయోగిస్తున్నారు. కొందరు సక్రమంగా బిల్లులు చెల్లిస్తూ.. మంచి క్రెడిట్‌ స్కోర్‌ను మెయింటెన్‌ చేస్తున్నారు. అయితే అలాంటి వారి కోసం కొన్ని బ్యాంకులు యాడ్‌ ఆన్‌ క్రెడిట్‌ కార్డులను కూడా అందిస్తున్నాయి. ఈ యాడ్‌ ఆన్‌ క్రెడిట్‌ కార్డులను ఆ వ్యక్తి తమ కుటుంబ సభ్యుల కోసం దరఖాస్తు చేసుకోవాలి. సాధారణంగా క్రెడిట్‌ కార్డు కావాలంటే బ్యాంకు అధికారులు అనేక పత్రాలను పరిశీలించి.. అర్హత ఉంటేనే అందజేస్తారు. కానీ, కుటుంబ సభ్యుల కోసం తీసుకునే ఈ కార్డులకు ఎలాంటి అర్హత అవసరం లేదు. దీన్నే సప్లిమెంటరీ క్రెడిట్‌ కార్డు అని కూడా అంటారు.

ఎలా అప్లై చేసుకోవాలి?

ఇప్పటికే క్రెడిట్‌ కార్డ్‌ ఉన్న వ్యక్తి.. ఆన్‌లైన్‌ లేదా ఆఫ్‌లైన్‌లో ఈ యాడ్‌ ఆన్‌ కార్డ్‌ల కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్‌లైన్‌లో అయితే ఇంటర్నెట్‌ బ్యాంకింగ్‌, మొబైల్‌ బ్యాంకింగ్‌ ద్వారా అప్లై చేసుకోవాలి. ఆఫ్‌లైన్‌ ద్వారా అంటే.. సమీపంలోని బ్యాంకు శాఖను సందర్శించాలి. బ్యాంక్‌ కస్టమర్‌ కేర్‌ను సంప్రదించి కూడా సప్లిమెంటరీ క్రెడిట్‌ కార్డును పొందవచ్చు.

ప్రయోజనాలు

ప్రైమరీ కార్డుకి ఉండే దాదాపు అన్ని ప్రయోజనాలు ఈ కార్డుకు కూడా వర్తిస్తాయి.

ప్రైమరీ కార్డు హోల్డర్ల మాదిరిగానే యాడ్‌ ఆన్‌ కార్డు హోల్డర్లు కూడా రివార్డు పాయింట్లను పొందవచ్చు.

సప్లిమెంటరీ క్రెడిట్‌ కార్డును సక్రమంగా ఉపయోగిస్తే.. ప్రైమరీ యూజర్‌ క్రెడిట్‌ స్కోర్‌ మెరుగుపడుతుంది.

యాడ్‌ ఆన్‌ క్రెడిట్‌ కార్డులు తీసుకునేవారికి కొన్ని సంస్థలు క్రెడిట్‌ పరిమితి పెంచడం, అధిక రివార్డు పాయింట్లు ఇవ్వడం వంటి అదనపు ప్రయోజనాలను అందిస్తున్నాయి.

ప్రైమరీ కార్డుదారులకు, యాడ్‌ ఆన్‌ కార్డుల ద్వారా చేస్తున్న ఖర్చులను పర్యవేక్షించే వెసులుబాటు కూడా ఉంటుంది. దీంతో వారు సెకండరీ యూజర్‌పై పరిమితి విధించి.. కార్డు దుర్వినియోగాన్ని అరికట్టవచ్చు.

ఇవి గమనించండి

సెకండరీ యూజర్లు యాడ్‌ ఆన్‌ కార్డులను దుర్వినియోగం చేసే అవకాశం ఉంటుంది. ఆ ప్రభావం ప్రైమరీ యూజర్‌ క్రెడిట్‌ స్కోర్‌పై పడుతుంది.

యాడ్‌ ఆన్‌ క్రెడిట్‌ కార్డు హోల్డర్లు బిల్లు చెల్లించకపోతే.. అది ప్రైమరీ క్రెడిట్‌ కార్డు స్టేట్‌మెంట్‌లో చూపిస్తుంది. దీనివల్ల కూడా క్రెడిట్‌ స్కోర్‌ ప్రభావితమవుతుంది.

కొన్ని బ్యాంకులు యాడ్‌ ఆన్‌ కార్డులకు అదనపు ఫీజులు విధిస్తాయి.

Next Story