ఈ క్రెడిట్‌ కార్డులు లైఫ్‌టైం ఫ్రీ.. వీటి ప్రయోజనాలు తెలుసా?

సాధారణంగా క్రెడిట్‌ కార్డ్‌ వాడాలంటే.. బ్యాంకులో జాయినింగ్‌ ఫీజుతో పాటు రెన్యువల్‌ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఆ ఫీజులు మీరు క్రెడిట్‌ కార్డు వాడినా.. వాడకపోయినా చెల్లించాల్సిందే.

By అంజి  Published on  5 Feb 2024 5:08 AM GMT
Lifetime Free Credit Cards, Credit Card benefits, Banks

ఈ క్రెడిట్‌ కార్డులు లైఫ్‌టైం ఫ్రీ.. వీటి ప్రయోజనాలు తెలుసా?

సాధారణంగా క్రెడిట్‌ కార్డ్‌ వాడాలంటే.. బ్యాంకులో జాయినింగ్‌ ఫీజుతో పాటు రెన్యువల్‌ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఆ ఫీజులు మీరు క్రెడిట్‌ కార్డు వాడినా.. వాడకపోయినా చెల్లించాల్సిందే. అయితే, కొన్ని బ్యాంకులు క్రెడిట్‌ కార్డులను ఉచితంగా అందిస్తున్నాయి. ఆ క్రెడిట్‌ కార్డులు, వాటి ప్రయోజనాలు గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు.. షాపర్స్‌ స్టాప్‌ క్రెడిట్‌ కార్డుని లైఫ్‌టైమ్‌ ఫ్రీగా అందిస్తోంది. ఇంధనం మినహా షాపర్స్‌ స్టాప్‌ బ్రాండ్‌లు ఇతర కేటగిరీలపై గరిష్టంగా నెలకు 500 ఫస్ట్‌ సిటిజన్‌ పాయింట్లు సంపాదించుకోవచ్చు. ఒక ఫస్ట్‌ సిటిజన్‌ పాయింట్‌ 60 పైసలతో సమానం.

యాక్సిస్‌ బ్యాంక్‌

యాక్సిస్‌ మై జోన్‌ క్రెడిట్‌ కార్డ్‌ కూడా లైఫ్‌ టైమ్‌ ఫ్రీ క్రెడిట్‌ కార్డ్‌. స్విగ్గీలో ఒక్కో ఆర్డర్‌పై రూ.120 డిస్కౌంట్‌ లభిస్తుంది. ప్రతి రూ.200 ఖర్చుపై 4 ఎడ్జ్‌ రివార్డ్‌ పాయింట్లు పొందొచ్చు.

ఐసీఐసీఐ బ్యాంక్‌

ఐసీఐసీఐ బ్యాంక్‌ - అమెజాన్‌ కో బ్రాండ్‌ ఫ్రీ క్రెడిట్‌ కార్డుతో అమెజాన్‌ కొనుగోళ్లపై.. ప్రైమ్‌ వినియోగదారులకు 5 శాతం, నాన్‌ ప్రైమ్‌ మెంబర్స్‌కి 3 శాతం డిస్కౌంట్‌ ఇస్తోంది. ఇక డిజిటల్‌ క్యాష్‌ బ్యాక్‌ లభిస్తుంది. ఒక్కో రివార్డు పాయింట్‌ రూపాయితో సమానం.

కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌

కోటక్‌ మహీంద్రా ఫార్చూన్‌ గోల్డ్‌ కార్డ్‌ కూడా ఎలాంటి వార్షిక రుసుము, జాయినింగ్‌ ఫీజు లేకుండా ఫ్రీగా వస్తోంది. ఈ కార్డు ద్వారా చేసే ఇంధన కొనుగోళ్లపై ఒక సంవత్సరంలో రూ.3,500 వరకు రాయితీ లభిస్తుంది.

Next Story