లోన్లు తీసుకునేవారికి హెచ్‌డీఎఫ్‌సీ గుడ్‌న్యూస్
భారతదేశంలోని అతిపెద్ద ప్రైవేట్ బ్యాంకులలో ఒకటైన HDFC బ్యాంక్ మరో కీలక నిర్ణయం తీసుకుంది.
By అంజి Published on 8 Jan 2025 10:29 AM ISTలోన్లు తీసుకునేవారికి హెచ్‌డీఎఫ్‌సీ గుడ్‌న్యూస్
భారతదేశంలోని అతిపెద్ద ప్రైవేట్ బ్యాంకులలో ఒకటైన HDFC బ్యాంక్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. లోన్లపై వడ్డీరేట్లకు సంబంధించి కస్టమర్లకు హెచ్‌డీఎఫ్‌సీ ఉపశమనం కలిగించింది. ఎంచుకున్న కాల వ్యవధిలో దాని మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేట్స్‌ను 5 బేసిస్ పాయింట్లు తగ్గించింది. ఇది జనవరి 7, 2025 నుండి అమలులోకి వచ్చింది. ఫలితంగా లోన్లపై వడ్డీ రేట్లు స్వల్పంగా తగ్గాయి. ప్రస్తుతం హెచ్‌డీఎఫ్‌సీ ఎంసీఎల్‌ఆర్ 9.15 శాతం నుంచి 9.45 శాతం వరకు ఉన్నాయి. ఇది రుణగ్రహీతలకు ఉపశమనం కలిగిస్తుంది.
నవీకరించబడిన ఎంసీఎల్‌ఆర్ రేట్లు ఒక రోజుకు 9.15%, ఒక నెలకు 9.20%, మూడు నెలలకు 9.30%, ఆరు నెలలు, ఒక సంవత్సరానికి 9.40%, రెండు, మూడు సంవత్సరాల కాల వ్యవధికి 9.45%గా సెట్ చేయబడ్డాయి. సవరించిన వడ్డీ రేట్లు మంగళవారం నుంచే అమల్లోకి వచ్చాయి. ఎంసీఎల్‌ఆర్‌ను బట్టే బ్యాంకులు వివిధ రకాల లోన్లపై వడ్డీరేట్లను నిర్ణయిస్తారు. 2016లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ప్రవేశపెట్టిన ఎంసీఎల్‌ఆర్‌ను ప్రవేశపెట్టింది. ఎంసీఎల్‌ఆర్‌తో అనుసంధానించబడిన రుణాలు కలిగిన రుణగ్రహీతలు ఎంసీఎల్‌ఆర్ రేట్లు మారినప్పుడు వారి ఈఎంఐలలో మార్పులను చూస్తారు.