ఐఫోన్ 11 మరింత చౌకగా సొంతం చేసుకోండి..!
Grab iPhone 11 at Rs 48,999.ఐఫోన్ ప్రేమికుల దృష్టి ప్రస్తుతానికి ఐఫోన్ 12 మీద పడడంతో.. ఐఫోన్ 11 సిరీస్ ధర భారీగా తగ్గుతోంది.
By Medi Samrat Published on 12 April 2021 4:01 PM ISTఐఫోన్ ప్రేమికుల దృష్టి ప్రస్తుతానికి ఐఫోన్ 12 మీద పడడంతో.. ఐఫోన్ 11 సిరీస్ ధర భారీగా తగ్గుతోంది. ప్రస్తుతం ఫ్లిప్ కార్ట్ సంస్థలో ఫ్లాగ్ షిప్ ఫస్ట్ సేల్ నడుస్తూ ఉంది. ఈ సేల్ నేటితో మొదలై ఏప్రిల్ 15న ముగియనుంది. దీంతో మంచి స్పెసిఫికేషన్స్ ఉన్న మొబైల్ ఫోన్స్ ను సొంతం చేసుకోవాలని అనుకునేవారు హ్యాపీగా ఫ్లిప్ కార్ట్ సైట్ లో షాపింగ్ చేసేసుకోవచ్చు. ఎన్నో మొబైల్స్ మీద ఫ్లిప్ కార్ట్ భారీ డిస్కౌంట్ ఇవ్వడమే కాకుండా నో కాస్ట్ ఈఎంఐ సదుపాయాన్ని కూడా ఇవ్వనుంది.
ఫ్లిప్ కార్ట్ లో ఎల్జీ వింగ్ మొబైల్ ను 29999 రూపాయలకే అందించనుంది. ఈ మొబైల్ మీద ఏకంగా 40వేల రూపాయల భారీ డిస్కౌంట్ ఇవ్వనుంది. ఎల్జీ సంస్థ ఈ మొబైల్ ను భారత్ లో 69999 రూపాయలకు లాంఛ్ చేసింది. ఎల్జీ సంస్థ ఇటీవలే తమ స్మార్ట్ ఫోన్ మార్కెట్ ను మూసి వేస్తున్నట్లు తెలపడంతో స్టాక్ ను క్లియర్ చేయాలని అనుకుంటూ ఉంది. దీంతో ఎల్జీ ద్యూయల్ స్క్రీన్ ఫోన్ వింగ్ ను 29999 రూపాయలకే అందుబాటులోకి తీసుకుని వచ్చింది.
ఐఫోన్ 11, ఐఫోన్ 11ఆర్ మీద కూడా భారీ డిస్కౌంట్ ఇచ్చింది ఫ్లిప్ కార్ట్ సంస్థ. యాపిల్ ఎక్స్ ఆర్ మొబైల్ ను 39999 రూపాయలకే ఫ్లిప్ కార్ట్ లో కొనుక్కోవచ్చు. యాపిల్ సంస్థ యాపిల్ ఎక్స్ ఆర్ మొబైల్ ను సాధారణంగా 47900 రూపాయలకు అమ్ముతూ ఉంది. కానీ ఫ్లిప్ కార్ట్ సేల్ లో భాగంగా భారీ డిస్కౌంట్ ఇచ్చింది. ఇక యాపిల్ ఐఫోన్ 11 ధర కూడా భారీగా తగ్గింది. 48999 రూపాయలకే యాపిల్ ఐఫోన్ ఫ్లిప్ కార్ట్ లో లభించనుంది. ఈ మొబైల్ ధర 54900 రూపాయలు ఉండగా ఇప్పుడు ఫ్లిప్ కార్ట్ సేల్ లో భాగంగా మంచి డిస్కౌంట్ చ్చారు. ఈ మొబైల్ ఫోన్ ను కావాలంటే నో కాస్ట్ ఈఎంఐలో కూడా సొంతం చేసుకోవచ్చు.