నేటీ నుంచి అదనపు ధృవీకరణ తప్పనిసరి.. లేకపోతే నో లాగిన్
Google will Auto Enrol users in Two Step verification from Today.ఇటీవల కాలంలో సైబర్ నేరాలు పెరిగిపోతున్నాయి.
By తోట వంశీ కుమార్ Published on 9 Nov 2021 8:40 AM ISTఇటీవల కాలంలో సైబర్ నేరాలు పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో వినియోగదారులకు సురక్షితమైన సేవలు అందించేందుకు పలు టెక్ కంపెనీలు పటిష్టమైన భద్రతా చర్యలను తీసుకునేందుకు ప్రాధాన్యం ఇస్తున్నాయి. ఈ క్రమంలోనే గూగుల్ మరింత సెక్యూర్ కానుంది. నేటి నుంచి గూగుల్ లో లాగిన్ కావాలంటే రెండు దశల ధృవీకరణ తప్పనిసరి. దీనికి సంబంధించి ఈ ఏడాది మే నెలలోనే గూగుల్ ప్రకటనను విడుదల చేసింది. నేటి నుంచి(నవంబర్ 9) నుంచి అమల్లోకి తీసుకురానున్నట్లు ప్రకటించింది. వినియోగదారుల అదనపు భద్రత కోసం గూగుల్.. 2SV అంటే రెండు దశల ధృవీకరణ తప్పనిసరి చేసింది. 2021 చివరిక కల్లా 150 మిలియన్ల గూగుల్ యూజర్స్, 2 మిలియన్ల యూట్యూబ్ యూజర్లు ఈ ఫీచర్‌ను తప్పక ఉపయోగించాల్సిందేనని గూగుల్ తెలిపింది.
రెండు దశల ధృవీకరణ(2-Step Verification)..
సైబర్ నేరగాళ్ల బారీన పడకుండా ఉండేందుకు ఈ రెండు దశల ధృవీకరణనను గూగుల్ తీసుకువచ్చింది. ఇప్పటికే కొద్ది మంది దీనిని ఉపయోగిస్తున్నారు. యూజర్లు తమ ఖాతాల్లోకి లాగిన్ అయ్యేటప్పుడు టూ స్టెప్ వెరిఫికేషన్ యాక్టివేట్ చేయమని గూగుల్ సూచిస్తుంది. దాన్ని ఎనేబుల్ చేసిన తరువాత యూజర్ పోన్ లేదా ఈ మెయిల్‌కు ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని ఎంటర్ చేస్తేనే ఖాతా ఓపెన్ అవుతుంది. నిన్నటి వరకు ఈ ఫీచర్‌ను ఎనేబుల్ చేయకుంటే నేటి నుంచి ఆటో మేటిగ్గా యాక్టివేట్ కానుంది.
ఎలా ఎనేబుల్ చేయాలంటే..?
- మీ ఈ మెయిల్ ఐడీ, పాస్‌వర్డ్‌తో జీ మెయిల్‌లో లాగిన అయిన కుడివైపు పైన మీ పేరు లేదా ఫోటోపై క్లిక్ చేయాలి. అందులో మేనేజ్ యువర్ గూగుల్ అకౌంట్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేస్తే.. గూగుల్ అకౌంట్ సెట్టింగ్స్ ఓపెన్ అవుతాయి. వాటిలో సెక్యూరిటీ ఆప్షన్‌పై క్లిక్ చేసి కిందకు వస్తే టూ సెప్ట్ వెరిఫికేషన్ ఫీచర్ కనిపిస్తుంది. అక్కడ మీకు ఆఫ్ అని కనిపిస్తే.. దానిపై క్లిక్ చేస్తే వెరిఫికేషన్ పూర్తి చేసేందుకు కొనసాగించమని అడుగుతుంది. అనంతరం ఫోన్ నెంబర్‌కు ఓటీపీ వస్తుంది. దాన్ని ఎంటర్ చేయగానే టూ స్టెప్ వెరిఫికేషన్ యాక్టివేట్ అవుతుంది.
లాగిన్ కోసం ఫోన్‌కు రెండు-దశల ధృవీకరణ అవసరం అంటే మీరు మీ లాగిన్‌ను యాక్సెస్ చేయడానికి అదనపు దశను అనుసరించాలి. అంటే, మీ ఖాతా భద్రత మునుపటితో పోలిస్తే పెరుగుతుంది.