8 ల‌క్ష‌ల యాప్‌ల‌పై నిషేదం.. ఆ యాప్‌ల‌ను వెంట‌నే తొల‌గించండి

Google Play and Apple App Store Bans 8 Lakh Apps.భద్రతా కారణాల దృష్ట్యా ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 8 లక్షల

By తోట‌ వంశీ కుమార్‌  Published on  22 Sept 2021 12:27 PM IST
8 ల‌క్ష‌ల యాప్‌ల‌పై నిషేదం.. ఆ యాప్‌ల‌ను వెంట‌నే తొల‌గించండి

భద్రతా కారణాల దృష్ట్యా ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 8 లక్షల యాప్‌ల‌ను గూగుల్ ప్లే స్టోర్, యాపిల్ యాప్ స్టోర్ల నుంచి నిషేదించారు. పిక్స్‌లేట్ అనే సైబ‌ర్ సెక్యురిటీ సంస్థ ఇచ్చిన నివేదిక ఆధారంగా గూగుల్, యాపిల్ స్టోర్ల నుంచి ఈ యాప్‌ల‌ను తొల‌గించివేశారు. 'హెచ్1 2021 డీలిస్టెడ్ మొబైల్స్ రిపోర్ట్' పేరిట పిక్సలేట్ ఒక నివేదిక‌ను విడుద‌ల చేసింది. ఇందులో మోస‌పూరిత‌, హానికార‌మైన 8.13 లక్షల యాప్ ల జాబితాను త‌యారు చేసింది. ఈ యాప్‌లు కెమెరా, జీపీఎస్ వంటి ద్వారా యూజ‌ర్ డేటాను సేక‌రిస్తున్న‌ట్లు అందులో వెల్ల‌డించింది. 86శాతం యాప్‌లు 12ఏళ్ల‌లోపు చిన్న పిల్ల‌లే ల‌క్ష్యంగా సైబ‌ర్ దాడుల‌కు పాల్పడుతున్నాయని ఆ నివేదికలో పేర్కొన్నది.

ఈ యాప్‌ల‌కు సుమారు 21మిలియ‌న్ యూజ‌ర్ రివ్యూలు ఉన్న‌ట్లు తెలిపింది. ఈ యాప్‌ల‌ను ఇప్ప‌టికే చాలా మంది ఉప‌యోగిస్తున్నారని తెలిపింది. యాపిల్‌ యాప్‌స్టోర్‌, గూగుల్ ప్లేస్టోర్‌ నుంచి యాప్‌లను నిషేధించినప్పటికీ.. ఆయా యాప్ లను ఇప్పటికే మొబైల్ ఫోన్లలో డౌన్ లోడ్ చేసుకొని ఉంటె అలాగే ఉంటాయని.. మొబైల్ ఫోన్ లో ఉన్న యాప్ లు స్టోర్లలో ఉన్నాయో లేదో చెక్ చేసుకోవాలని, ఒకవేళ ప్లే స్టోర్లలో లేకుంటే వెంటనే వాటిని డిలీట్ చేయాలని టెక్ నిపుణులు సూచిస్తున్నారు. స్టోర్ విధానాలను ఉల్లంఘించే యాప్ ల నుంచి ముప్పు ఎక్కువగా ఉండే అవకాశం ఉందని అంటున్నారు. ఇంకెందు ఆల‌స్యం మీ ఫోన్ లో ఉన్న యాప్‌లు.. స్టోర్ల‌లో ఉన్నాయో లేదో ఓసారి త‌నిఖీ చేసుకోవండి. ఒక‌వేళ లేన‌ట్లు అయితే.. వెంట‌నే వాటిని డిలీట్ చేయండి.

Next Story