రోజురోజుకీ డిజిటల్ టెక్నాలజీ పెరగడంతో చాలామంది వారి ప్రతిరోజు లావాదేవీలకు డిజిటల్ ట్రాన్సాక్షన్ పద్ధతినీ ఉపయోగిస్తున్నారు. అదేవిధంగా కరోనా మహమ్మారి విలయ తాండవం సృష్టించడంతో డబ్బులు చేతులు మారడం కన్నా డిజిటల్ ట్రాన్సాక్షన్ పద్ధతి సురక్షితం అని భావించి, చిన్న వ్యాపారస్తుల నుంచి మొదలుకుని ప్రతి ఒక్కరు గూగుల్ పే, ఫోన్ పే తో సహా థర్డ్ పార్టీ యూపీఐ యాప్స్ ద్వారా లావాదేవీలను నడుపుతున్నారు. అయితే ఈ లావాదేవీలపై జనవరి 1 నుంచి అదనపు చార్జీలు వర్తిస్తాయని పలు నివేదికలి వెలువడ్డాయని తప్పుడు ప్రచారం జోరుగా సాగింది.
ఈ నేపథ్యంలోనే నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా NPCI యూపీఐ లావాదేవీలు నిర్వహించే వారికి యూపీఏ ట్రాన్సాక్షన్ ద్వారా అదనపు చార్జీలు వసూలు చేయడం లేదని తెలియజేసింది. దీని ద్వారా గూగుల్ పే, ఫోన్ పే వంటి యాప్ ద్వారా ట్రాన్సాక్షన్ జరిపే వారికి ఇది ఇది కొంతవరకు ఉపశమనం కలిగించే విషయమని చెప్పవచ్చు
యూపీ ట్రాన్సాక్షన్స్ ఎప్పటిమాదిరిగానే నిర్వహించుకోవచ్చని పలు నివేదికల ద్వారా వెలువడిన తప్పుడు సమాచారాన్ని నమ్మవద్దని, యూజర్ ల నుంచి ఎలాంటి అదనపు చార్జీలు వసూలు చేసేది లేదని తాజాగా NPCI తెలియజేసింది. అమెజాన్ పే, గూగుల్ పే, ఫోన్ పే,ఎన్‌పీసీఐ థర్డ్ పార్టీ యాప్స్‌పై జనవరి 1 నుంచి అదనపు చార్జీలు విధించే అవకాశం ఉందనే అంచనాలు నెలకొన్నాయి. అయితే ఈ విషయంపై NPCI ఎలాంటి చార్జీలు ఉండవని స్పష్టంగా తెలియజేసింది.దీనిద్వారా ఇదివరకే ఎలా లావాదేవీలు జరుగుతుండేవి అలాగే యూజర్లు ట్రాన్సాక్షన్ జరుపుకోవచ్చు NPCI పేర్కొంది.