పెన్షనర్లకు గుడ్‌న్యూస్‌.. ఒక్క SMSతో లోన్‌ మంజూరు

Good News For Pensioners.ఒక్క ఎస్‌ఎంఎస్‌ చేస్తే చాలు ఎస్‌బీఐ రుణం అందిస్తున్నట్లు తెలిపింది.

By Medi Samrat  Published on  24 Feb 2021 8:37 AM GMT
Good News For Pensioners

ప్రభుత్వరంగ అతిపెద్ద బ్యాంక్‌ అయిన స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ ) తన కస్టమర్లకు రోజురోజుకు కొత్త స్కీమ్‌లను ప్రవేశపెడుతూ అందుబాటులోకి తీసుకువస్తోంది. రోజురోజుకు కస్టమర్లకు గుడ్‌న్యూస్‌ చెబుతూ తన ట్వీట్టర్‌ ఖాతాల్లో షేర్‌ చేస్తోంది ఎస్‌బీఐ. తాజాగా పెన్షనర్లకు శుభవార్త వినిపించింది. రుణం విషయంలో లోన్‌ ఆప్షన్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ మేరకు తన ట్విట్టర్‌ ఖాతాలో ఓ పోస్టు చేసింది. కేవలం ఒక్క ఎస్‌ఎంఎస్‌ చేస్తే చాలు ఎస్‌బీఐ రుణం అందిస్తున్నట్లు తెలిపింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి పింఛన్‌ తీసుకునేవారు, డిఫెన్స్‌ పెన్షనర్లు, ఫ్యామిలీ పెన్షనర్లు రుణం తీసుకునేందుకు అర్హులు అని ఎస్‌బీఐ పేర్కొంది. అంతేకాదు 9.75 శాతం వడ్డీతో సంతోషంగా రిటైర్మెంట్‌ తీసుకోవచ్చని పేర్కొంది. అయితే ఈ రుణంల అప్ టూ రూ.14 లక్షల వరకు పొందే అవకాశం ఉందని ఎస్‌బీఐ వెల్లడించింది.

ఎస్‌ఎంఎస్ (SMS)‌ అలాగంటే..

PERSONAL అని టైప్ చేసి 7208933145 నెంబర్‌కు మెస్సేజ్‌ చేయాలని తన ట్వీట్‌లో ఎస్బీఐ తెలిపింది. అలాగే 7208933142కు మిస్డ్‌ కాల్‌ ఇస్తే మీకు ఎస్‌బీఐ కాంటాక్ట్‌ సెంటర్‌ నుంచి కాల్ బ్యాక్‌ చేస్తారు. అంతేకాదు మీ పిల్లల వివాహాలు చేయడానికి, మీ డ్రీమ్‌ హోమ్‌ కొనుగోలు చేసేందుకు, మెడికల్‌ అవసరాల కోసం రిటైర్మెంట్‌ ఫండ్‌ తరహాలో ఎస్‌బీఐ పెన్షనర్లకు పెన్షన్‌ లోన్‌ అందిస్తుంది. పూర్తి వివరాలకు ఎస్‌బీఐ కస్టమర్‌ కేర్‌ నెంబర్‌ 1800-11-2211కు కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చని తెలిపింది.




Next Story