సిలిండర్‌ వినియోగదారులకు అదిరిపోయే శుభవార్త

Good news for LPG Cylinder customers.సిలిండర్‌ వాడే వారి కోసం కేంద్ర ప్రభుత్వం త్వరలో అదిరిపోయే కొత్త రూల్స్‌ తీసుకురానుంది.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  4 March 2021 3:25 AM GMT
Good news for LPG Cylinder customers

సిలిండర్‌ వాడే వారి కోసం కేంద్ర ప్రభుత్వం త్వరలో అదిరిపోయే కొత్త రూల్స్‌ తీసుకురానుంది. రానున్న రోజుల్లో ఏ డీలర్‌ అయినా గ్యాస్‌ సిలిండర్‌ బుక్‌ చేసుకునే సదుపాయం తీసుకురాబోతోంది కేంద్ర ప్రభుత్వం. ఈ కొత్త విధానం అమల్లోకి వస్తే వినియోగదారులకు ఎంతో మేలు జరగనుంది. తాజాగా అందుతున్న వివరాల ప్రకారం.. రానున్న రోజుల్లో మీరు మీకు నచ్చిన డీలర్‌ వద్ద సిలిండర్‌ బుక్‌ చేసుకోవచ్చు. ఎవరి వద్దనైనా సిలిండర్‌ డెలివరి చేసుకునే సదుపాయం అందుబాటులోకి తీసుకువచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ఇందు కోసం కేంద్ర కొత్త స్టాఫ్ట్‌ వేర్‌ను రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. ఇండేన్, భారత్, హెచ్‌పీ ఇలా ఏ కస్టమర్ అయినా ఏ కంపెనీ డీలర్ వద్దనైనా సిలిండర్ డెలివరీ తీసుకునే వెసులుబాటు రానుంది. దీంతో వినియోగదారులకు మరింత సులభతరం కానుంది. మోదీ ప్రభుత్వం గ్యాస్ సిలిండర్ కనెక్షన్ రూల్స్‌ కూడా సవరించేందుకు ప్రణాళికలు రూపొందిస్తోంది.

కాగా, గ్యాస్‌ కనెక్షన్‌ తీసుకోవాలంటే తప్పకుండా అడ్రస్‌ ప్రూఫ్‌ కావాలి. తగిన అడ్రస్‌ ప్రూఫ్‌ అందిస్తేనే కొత్త కనెక్షన్‌ ఇస్తారు. అయితే ఈ నిబంధనల్లో మార్పులు తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఎలాంటి అడ్రస్‌ ప్రూఫ్‌ లేకపోయినా కూడా గ్యాస్‌ సిలిండర్‌ లభ్యమయ్యేలా చర్యలు చేపట్టనుంది. దీనిపై ఇప్పటికే చర్యలు ప్రారంభించినట్లు సమాచారం. ఈ విధానం కనుకు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తే వినియోగదారులకు ఎంతో మేలు జరుగుతుంది. సిలిండర్లతో ఉన్న కొంత ఇబ్బందులు దూరమవుతాయి. ప్రస్తుతం గ్యాస్‌ సిలింబర్‌ బుక్‌ చేసుకోవాలంటే వారికి ఉన్న డీలర్ వద్దకే వెళ్లాల్సి ఉంటుంది. తాజాగా కేంద్రం తీసుకువచ్చే విధానం అందుబాటులోకి వస్తే అలాంటి ఇబ్బంది ఉండదు. ఏ డీలర్‌ వద్దనైనా సిలిండర్‌ తీసుకునే వెలుసుబాటు ఉంటుంది.


Next Story