బంగారం ప్రియుల‌కు షాక్‌.. పెరిగిన ధ‌ర‌.. ఏ న‌గ‌రాల్లో ఎంత ఉందంటే..?

Gold price today in hyderabad.భార‌త్‌లో బంగారానికి ఉన్న డిమాండ్ మ‌రేదానికి ఉండ‌దు. గ‌త కొద్ది రోజులుగా బంగారం ధరల్లో

By తోట‌ వంశీ కుమార్‌  Published on  8 May 2021 3:38 AM GMT
బంగారం ప్రియుల‌కు షాక్‌.. పెరిగిన ధ‌ర‌.. ఏ న‌గ‌రాల్లో ఎంత ఉందంటే..?

భార‌త్‌లో బంగారానికి ఉన్న డిమాండ్ మ‌రేదానికి ఉండ‌దు. గ‌త కొద్ది రోజులుగా బంగారం ధరల్లో ఒడిదుడుకులు కొనసాగుతూనే ఉన్నాయి. గత వారం రోజులుగా పెరుగుతూ.. తగ్గుతూ వస్తున్న బంగారం ధర.. నేడు మాత్రం అమాంతం పెరిగింది. శనివారం 10 గ్రాములపై రూ.510 వరకు పెరిగింది. కాగా..దేశంలో ఒక్కో నగరంలో ఒక్కో విధంగా పెరుగుతోంది. దేశీయంగా చూస్తే.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,800 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.45,290 వద్ద ఉంది.

ప్రధాన నగరాల్లో ధ‌ర‌లు ఇలా ఉన్నాయి..

దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,910 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,950 ఉంది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,970 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 45,800 ఉంది. చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,970 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.49,060 వద్ద ఉంది. కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,850 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,940 వద్ద కొనసాగుతోంది.

ఇక హైదరాబాద్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 550 పెరిగి రూ. 48,550 కు చేరగా.. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 500 పెరిగి రూ. 44,500 కు చేరింది. అలాగే విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,500 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,550 వద్ద ఉంది. ఇక నేడు బంగారంతో పాటు వెండి ధ‌ర‌ కూడా పెరిగింది. కిలో వెండి ధర ప్రస్తుతం రూ.1900 పెరిగి రూ. 76,100 వద్ద కొనసాగుతోంది.

బంగారం రేట్లపై ప్రభావం చూపే అంశాలు చాలానే ఉంటాయి. అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, కరోనా, వాటి వడ్డీ రేట్లు, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు, బాండ్ ఈల్డ్ వంటి పలు అంశాలు బంగారం ధరలపై ప్రభావం చూపుతాయని బులియన్‌ మార్కెట్‌ నిపుణులు అంటున్నారు.




Next Story