గుడ్‌న్యూస్‌.. వ‌రుస‌గా నాలుగో రోజు త‌గ్గిన బంగారం ధ‌ర

Gold price on September 3rd.వ‌రుస‌గా నాలుగో రోజు బంగారం ధ‌ర త‌గ్గింది. శ‌నివారం 10 గ్రాముల ప‌సిడి ధ‌ర‌పై రూ.100

By తోట‌ వంశీ కుమార్‌  Published on  3 Sep 2022 1:48 AM GMT
గుడ్‌న్యూస్‌.. వ‌రుస‌గా నాలుగో రోజు త‌గ్గిన బంగారం ధ‌ర

ప‌సిడి ధ‌ర‌ల్లో నిత్యం హెచ్చుత‌గ్గులు చోటు చేసుకుంటాయ‌న్న సంగ‌తి తెలిసిందే. గ‌త కొద్ది రోజులుగా పెరుగుతున్న ప‌సిడి ధ‌ర‌ల‌కు బ్రేక్ ప‌డింది. వ‌రుస‌గా నాలుగో రోజు బంగారం ధ‌ర త‌గ్గింది. శ‌నివారం 10 గ్రాముల ప‌సిడి ధ‌ర‌పై రూ.100 త‌గ్గింది. ఆయా ప్రాంతాల్లోని ప‌రిస్థితులు, డిమాండ్‌, ర‌వాణా వంటి వాటి కార‌ణంగా ధ‌ర‌ల త‌గ్గుద‌ల్లో స్వ‌ల్ప తేడాలు ఉంటాయి. దేశీయంగా 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,400 ఉండ‌గా.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,620 గా ఉంది.

ప్ర‌ధాన న‌గ‌రాల్లో పసిడి ధ‌ర‌లు ఇలా..

- ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,550, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,780

- ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,400, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,620

- చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,950, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,220

- కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,400, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,620

- బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,450, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,670

- పూణెలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధ‌ర రూ.46,430, 24 క్యారెట్ల 10 గ్రాముల ధ‌ర రూ.50,650

- హైద‌రాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,400, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,620

- విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,400, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,620

- విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,400, 24 క్యారెట్ల ధర రూ.50,620

బంగారం ధరల‌ హెచ్చుతగ్గులకు ఎన్నో కారణాలుంటాయి. అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు బంగారం రేట్లపై అధిక ప్రభావం చూపే అవకాశం ఉందని బులియన్‌ మార్కెట్‌ నిపుణులు చెబుతున్నారు.

Next Story