కొనుగోలుదారుల‌కు షాకిస్తున్న బంగారం ధ‌ర

Gold Price on October 4th.గ‌త రెండు రోజులుగా ఊర‌ట నిచ్చిన బంగారం ధ‌ర నేడు పెరిగింది. మంగ‌ళ‌వారం 10 గ్రాముల ప‌సిడి ధ‌ర‌పై

By తోట‌ వంశీ కుమార్‌  Published on  4 Oct 2022 6:53 AM GMT
కొనుగోలుదారుల‌కు షాకిస్తున్న బంగారం ధ‌ర

గ‌త రెండు రోజులుగా ఊర‌ట నిచ్చిన బంగారం ధ‌ర నేడు పెరిగింది. మంగ‌ళ‌వారం 10 గ్రాముల ప‌సిడి ధ‌ర‌పై రూ.500 పెరిగింది. ఆయా ప్రాంతాల్లో ఉన్న డిమాండ్‌, ప‌రిస్థితుల ఆధారంగా ధ‌ర‌ల పెరుగుద‌ల్లో స్వ‌ల్ప తేడాలుంటాయి. దేశీయంగా 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,350 ఉండ‌గా.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,660 గా ఉంది.

ప్ర‌ధాన న‌గ‌రాల్లో పసిడి ధ‌ర‌లు ఇలా..

- ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,500, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,820

- ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,350, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,660

- చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,750, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,100

- కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,350, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,660

- బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,400, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,710

- పూణెలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధ‌ర రూ.47,380, 24 క్యారెట్ల 10 గ్రాముల ధ‌ర రూ.51,690

- హైద‌రాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,350, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,660

- విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,350, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,660

- విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,350, 24 క్యారెట్ల ధర రూ.51,660

బంగారం ధరల‌ హెచ్చుతగ్గులకు ఎన్నో కారణాలుంటాయి. అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు బంగారం రేట్లపై అధిక ప్రభావం చూపే అవకాశం ఉందని బులియన్‌ మార్కెట్‌ నిపుణులు చెబుతున్నారు.

Next Story