షాకింగ్‌.. మ‌ళ్లీ పెరిగిన ప‌సిడి ధ‌ర

Gold price on October 20th.బంగారం ధ‌ర‌ల్లో హెచ్చుత‌గ్గులు చోటుచేసుకుంటున్నాయి. నిన్న ప‌సిడి ధ‌ర త‌గ్గ‌గా.. నేడు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  20 Oct 2022 1:59 AM GMT
షాకింగ్‌.. మ‌ళ్లీ పెరిగిన ప‌సిడి ధ‌ర

దీపావ‌ళి పండుగ ద‌గ్గ‌ర ప‌డుతుండ‌డంతో ఎక్కువ మంది బంగారాన్ని కొనుగోలు చేసేందుకు ఆస‌క్తి చూపిస్తుంటారు. ఇక బంగారం ధ‌ర‌ల్లో హెచ్చుత‌గ్గులు చోటుచేసుకుంటున్నాయి. నిన్న ప‌సిడి ధ‌ర త‌గ్గ‌గా.. నేడు పెరిగింది. గురువారం 10 గ్రాముల ప‌సిడి ధ‌ర‌పై రూ.130 మేర పెరిగింది. దేశీయంగా 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,550 ఉండ‌గా.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,780 గా ఉంది.

ప్ర‌ధాన న‌గ‌రాల్లో పసిడి ధ‌ర‌లు ఇలా..

- ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,700, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,950

- ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,550, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,780

- చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,000, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,270

- కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,550, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,780

- బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,600, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,840

- పూణెలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధ‌ర రూ.46,580, 24 క్యారెట్ల 10 గ్రాముల ధ‌ర రూ.50,700

- హైద‌రాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,550, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,780

- విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,550, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,780

- విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,550, 24 క్యారెట్ల ధర రూ.50,780

బంగారం ధరల‌ హెచ్చుతగ్గులకు ఎన్నో కారణాలుంటాయి. అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు బంగారం రేట్లపై అధిక ప్రభావం చూపే అవకాశం ఉందని బులియన్‌ మార్కెట్‌ నిపుణులు చెబుతున్నారు.

Next Story