బంగారం కొనాల‌నుకునే వారికి భారీ షాక్‌

Gold price on November 6th.ప‌సిడి కొనుగోలుదారుల‌కు ధ‌ర‌లు షాకిస్తున్నాయి.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  6 Nov 2022 2:08 AM GMT
బంగారం కొనాల‌నుకునే వారికి భారీ షాక్‌

ప‌సిడి కొనుగోలుదారుల‌కు ధ‌ర‌లు షాకిస్తున్నాయి. నిన్న ప‌సిడి ధ‌ర త‌గ్గగా.. నేడు భారీగా పెరిగింది. ఆదివారం ఉద‌యం 10 గ్రాముల ప‌సిడి ధ‌ర రూ.990 మేర పెరిగింది. దేశీయంగా 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,000 ఉండ‌గా.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,280గా ఉంది.

ప్ర‌ధాన న‌గ‌రాల్లో పసిడి ధ‌ర‌లు ఇలా..

- ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,150, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,440

- ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,000, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,280

- చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,770, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,040

- కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,000, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,280

- బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,050, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,330

- పూణెలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధ‌ర రూ.47,030, 24 క్యారెట్ల 10 గ్రాముల ధ‌ర రూ.51,310

- హైద‌రాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,000, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,280

- విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,000, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,280

- విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,000, 24 క్యారెట్ల ధర రూ.51,280

బంగారం ధరల‌ హెచ్చుతగ్గులకు ఎన్నో కారణాలుంటాయి. అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు బంగారం రేట్లపై అధిక ప్రభావం చూపే అవకాశం ఉందని బులియన్‌ మార్కెట్‌ నిపుణులు చెబుతున్నారు.

వెండి ధ‌ర కూడా రూ.2వేల వ‌ర‌కు పెరిగింది. కిలో వెండి చెన్నైలో రూ.66,300, ముంబైలో రూ.60,500, కోల్‌కతాలో రూ.60,500, ఢిల్లీలో రూ.60,500, హైదరాబాద్‌లో రూ.66,300, కేరళలో రూ.66,300, విజయవాడలో రూ.66,300 గా ఉంది.
Next Story