షాకిచ్చిన బంగారం.. త‌గ్గిన వెండి

Gold price on November 3rd.నిన్న, మొన్న‌టి వ‌ర‌కు త‌గ్గుముఖం ప‌ట్టిన ప‌సిడి ధ‌ర నేడు పెరిగింది.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  3 Nov 2022 1:48 AM GMT
షాకిచ్చిన బంగారం.. త‌గ్గిన వెండి

నిన్న, మొన్న‌టి వ‌ర‌కు త‌గ్గుముఖం ప‌ట్టిన ప‌సిడి ధ‌ర నేడు పెరిగింది. గురువారం 10 గ్రాముల ప‌సిడి ధ‌ర‌పై రూ.300 పెరిగింది. ఆయా ప్రాంతాల్లోని ప‌రిస్థితులు, డిమాండ్ వంటి అంశాల కార‌ణంగా పెరుగుద‌ల్లో స్వ‌ల్ప తేడాలుంటాయి. దేశీయంగా 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,850 ఉండ‌గా.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,110 గా ఉంది.

ప్ర‌ధాన న‌గ‌రాల్లో పసిడి ధ‌ర‌లు ఇలా..

- ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,000, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,230

- ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,850, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,110

- చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,410, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,720

- కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,850, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,110

- బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,900, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,160

- పూణెలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధ‌ర రూ.46,880, 24 క్యారెట్ల 10 గ్రాముల ధ‌ర రూ.51,140

- హైద‌రాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,850, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,110

- విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,850, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,110

- విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,850, 24 క్యారెట్ల ధర రూ.51,110

బంగారం ధరల‌ హెచ్చుతగ్గులకు ఎన్నో కారణాలుంటాయి. అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు బంగారం రేట్లపై అధిక ప్రభావం చూపే అవకాశం ఉందని బులియన్‌ మార్కెట్‌ నిపుణులు చెబుతున్నారు.

బంగారం ధ‌ర పెరిగితే వెండి రేటు త‌గ్గింది. కిలో వెండిపై రూ.600 వ‌ర‌కు త‌గ్గింది. కిలో వెండి చెన్నైలో రూ.64,500, ముంబైలో రూ.58,900, కోల్‌కతాలో రూ.58,900, బెంగళూరులో రూ.64,500, ఢిల్లీలో రూ.58,900, హైదరాబాద్‌లో రూ.64,500, కేరళలో రూ.64,500, విజయవాడలో రూ.64,500 గా ఉంది.

Next Story