స్వల్పంగా తగ్గిన బంగారం.. భారీగా పెరిగిన వెండి
Gold price on November 2nd.ప్రతి రోజు బంగారం, వెండి ధరల్లో మార్పులు చోటు చేసుకుంటాయి.
By తోట వంశీ కుమార్ Published on 2 Nov 2022 2:02 AM GMTప్రతి రోజు బంగారం, వెండి ధరల్లో మార్పులు చోటు చేసుకుంటాయి. ఓ సారి తగ్గితే మరోసారి పెరుగుతూ ఉంటుంది. కొద్ది రోజుల క్రితం పరుగులు పెట్టిన బంగారం ఇటీవల తగ్గుముఖం పడుతోంది. నేడు కూడా స్వల్పంగా తగ్గింది. బుధవారం 10 గ్రాముల పసిడి ధరపై రూ.50 తగ్గింది. దేశీయంగా 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,550 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,780 గా ఉంది.
ప్రధాన నగరాల్లో పసిడి ధరలు ఇలా..
- ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,700, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,930
- ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,550, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,780
- చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,300, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,600
- కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,550, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,780
- బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,600, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,830
- పూణెలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,580, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,810
- హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,550, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,780
- విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,550, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,780
- విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,550, 24 క్యారెట్ల ధర రూ.50,780
బంగారం ధరల హెచ్చుతగ్గులకు ఎన్నో కారణాలుంటాయి. అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు బంగారం రేట్లపై అధిక ప్రభావం చూపే అవకాశం ఉందని బులియన్ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.
బంగారం ధర తగ్గితే వెండి రేటు పెరిగింది. కిలో వెండిపై రూ.2000 వరకు పెరిగింది. కిలో వెండి చెన్నైలో రూ.65,000, ముంబైలో రూ.59,500, కోల్‌కతాలో రూ.65,000, బెంగళూరులో రూ.59,500, ఢిల్లీలో రూ.59,500, హైదరాబాద్‌లో రూ.65,000, కేరళలో రూ.65,000, విజయవాడలో రూ.65,000 గా ఉంది.