త‌గ్గేదేలే.. వ‌రుస‌గా మూడో రోజు పెరిగిన బంగారం ధ‌ర‌

Gold Price on August 27th. వ‌రుస‌గా మూడో రోజు కూడా బంగారం ధ‌ర పెరిగింది.శ‌నివారం 10 గ్రాముల ప‌సిడి ధ‌ర‌పై రూ.150

By తోట‌ వంశీ కుమార్‌  Published on  27 Aug 2022 2:48 AM GMT
త‌గ్గేదేలే.. వ‌రుస‌గా మూడో రోజు పెరిగిన బంగారం ధ‌ర‌

నిన్న మొన్న‌టి వ‌ర‌కు త‌గ్గిన ప‌సిడి ధ‌ర‌లు ఇటీవ‌ల పెరుగుతున్నాయి. వ‌రుస‌గా మూడో రోజు కూడా బంగారం ధ‌ర పెరిగింది. శ‌నివారం 10 గ్రాముల ప‌సిడి ధ‌ర‌పై రూ.150 మేర పెరిగింది. ఆయా ప్రాంతాల్లోని ప‌రిస్థితులు, డిమాండ్‌, ర‌వాణా వంటి అంశాల ఆధారంగా పెరుగుద‌ల్లో స్వ‌ల్ప తేడాలుంటాయి. దేశీయంగా 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,650 ఉండ‌గా.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,980 గా ఉంది.

ప్ర‌ధాన న‌గ‌రాల్లో పసిడి ధ‌ర‌లు ఇలా..

- ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,800, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,140

- ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,650, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,980

- చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,400, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,800

- కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,650, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,980

- బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,700, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,030

- పూణెలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధ‌ర రూ.47,730, 24 క్యారెట్ల 10 గ్రాముల ధ‌ర రూ.52,010

- హైద‌రాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,650, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,980

- విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,650, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,980

- విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,650, 24 క్యారెట్ల ధర రూ.51,980

Next Story