మ‌ళ్లీ పెరిగిన బంగారం ధ‌ర‌.. ఎంతంటే..?

Gold price on August 26th.మ‌న దేశంలో బంగారానికి డిమాండ్ ఎక్కువ‌గా ఉంటుంది అన్న సంగ‌తి తెలిసిందే. సంద‌ర్భం

By తోట‌ వంశీ కుమార్‌  Published on  26 Aug 2022 3:58 AM GMT
మ‌ళ్లీ పెరిగిన బంగారం ధ‌ర‌.. ఎంతంటే..?

మ‌న దేశంలో బంగారానికి డిమాండ్ ఎక్కువ‌గా ఉంటుంది అన్న సంగ‌తి తెలిసిందే. సంద‌ర్భం ఏదైనా స‌రే బంగారాన్ని కొనుగోలు చేసేందుకే ఎక్కువ మంది ఆస‌క్తి చూపిస్తుంటారు. అందువ‌ల్ల కొనుగోలు దారులు బంగారం ధ‌ర‌ల‌పై ఎల్ల‌ప్పుడూ ఓ క‌న్నేసి ఉంచుతారు. కాగా..ప‌సిడి ధ‌ర వ‌రుస‌గా రెండో రోజు కూడా పెరిగింది. 10 గ్రాముల ప‌సిడి ధ‌ర పై రూ.250 నుంచి రూ.480 మ‌ధ్య పెరిగింది. ఆయా ప్రాంతాల్లోని ప‌రిస్థితులు, డిమాండ్‌, ర‌వాణా వంటి అంశాల ఆధారంగా పెరుగుద‌ల్లో స్వ‌ల్ప తేడాలుంటాయి. దేశీయంగా 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,510 ఉండ‌గా.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,830 గా ఉంది.

ప్ర‌ధాన న‌గ‌రాల్లో పసిడి ధ‌ర‌లు ఇలా..

- ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,660, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,990

- ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,510, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,830

- చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,310, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,700

- కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,510, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,830

- బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,560, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,880

- పూణెలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధ‌ర రూ.47,540, 24 క్యారెట్ల 10 గ్రాముల ధ‌ర రూ.51,860

- హైద‌రాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,510, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,830

- విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,510, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,830

- విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,510, 24 క్యారెట్ల ధర రూ.51,830


Next Story