శుభ‌వార్త‌.. త‌గ్గిన బంగారం ధ‌ర

Gold price on August 26th 2021.బంగారం ధ‌ర‌ల్లో నిత్యం హెచ్చుత‌గ్గులు చోటుచేసుకుంటూనే ఉంటాయి.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  26 Aug 2021 8:14 AM IST
శుభ‌వార్త‌.. త‌గ్గిన బంగారం ధ‌ర

బంగారం ధ‌ర‌ల్లో నిత్యం హెచ్చుత‌గ్గులు చోటుచేసుకుంటూనే ఉంటాయి. ఓరోజు పెరిగితే.. మ‌రో రోజు త‌గ్గుతూ ఉంటుంది. గ‌త కొద్ది రోజులుగా పెరుగుతూ వ‌చ్చింది. తాజాగా బంగారం ధ‌ర త‌గ్గింది. గురువారం ప‌సిడి ధ‌ర దేశీయంగా రూ.200 నుంచి రూ.300 వ‌ర‌కు త‌గ్గింది. ఒక్కొ ప్రాంతంలో ఒక్కొ విధంగా ప‌సిడి ధ‌ర‌ల్లో మార్పులు ఉంటాయి. పెళ్లిళ్ల సీజ‌న్ కావ‌డంతో బంగారానికి ప్ర‌స్తుతం బాగా డిమాండ్ ఉంది.

ప్ర‌ధాన న‌గ‌రాల్లో బంగారం ధ‌ర‌లు ఇలా..

- ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,500, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,700

- ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,490, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,490

- కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,850, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,550

- చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.44,650, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,710

- బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.44,350, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,380

- హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.44,350, 24 క్యారెట్ల 10 గ్రాముల రూ.48,380

- విశాఖలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.44,350, 24 క్యారెట్ల ధర రూ.48,380

ఇక బంగారం ధ‌ర‌ల్లో హెచ్చుత‌గ్గుల‌కు ఎన్నో కార‌ణాలుంటాయి. అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు వంటివి ప‌సిడి ధ‌ర‌పై ప్ర‌భావం చూపుతాయ‌ని బులియ‌న్ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.

Next Story