మహిళలకు శుభవార్త. గత కొద్ది రోజులుగా బంగారం ధర పతనం అవుతోంది. 10 రోజులుగా పసిడి ధర తగ్గడం తప్ప పెరగడం లేదు. ఈ రోజు కూడా బంగారం ధర భారీగా తగ్గింది. బుధవారం 10 గ్రాముల పసిడి ధరపై రూ.600 వరకు తగ్గింది. ఆయా ప్రాంతాల్లోని పరిస్థితులు, డిమాండ్, రవాణా వంటి అంశాల ఆధారంగా తగ్గుదల్లో స్వల్ప తేడాలుంటాయి. దేశీయంగా 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,000 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,230 గా ఉంది.
ప్రధాన నగరాల్లో పసిడి ధరలు ఇలా..
- ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,150, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,440
- ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,000, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,230
- చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,000, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,400
- కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,000, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,230
- బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,050, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,330
- పూణెలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,030, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,260
- హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,000, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,230
- విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,000, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,230
- విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,000, 24 క్యారెట్ల ధర రూ.51,230