మ‌గువ‌ల‌కు షాకిచ్చిన బంగారం

Gold Price on August 14th.ప్ర‌తి నిత్యం బంగారం ధ‌ర‌ల్లో హెచ్చుత‌గ్గులు చోటు చేసుకుంటాయ‌న్న సంగ‌తి తెలిసిందే. ఓ సారి

By తోట‌ వంశీ కుమార్‌  Published on  14 Aug 2022 1:40 AM GMT
మ‌గువ‌ల‌కు షాకిచ్చిన బంగారం

ప్ర‌తి నిత్యం బంగారం ధ‌ర‌ల్లో హెచ్చుత‌గ్గులు చోటు చేసుకుంటాయ‌న్న సంగ‌తి తెలిసిందే. ఓ సారి త‌గ్గితే మ‌రోసారి పెరుగుతూ ఉంటుంది. వ‌రుస‌గా రెండో రోజు కూడా ప‌సిడి ధ‌ర పెరిగింది. ఆదివారం 10 గ్రాముల ప‌సిడి ధ‌ర‌పై రూ.400 నుంచి రూ.440 మేర పెరిగింది. దేశంలోని ఆయా ప్రాంతాల్లో ఉన్న డిమాండ్‌, ర‌వాణా వంటి కార‌ణాల వ‌ల్ల ధ‌ర‌ల పెరుగుద‌ల్లో స్వ‌ల్ప తేడాలుంటాయి. దేశీయంగా 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,150 ఉండ‌గా.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,530 గా ఉంది.

ప్ర‌ధాన న‌గ‌రాల్లో పసిడి ధ‌ర‌లు..

- ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,300, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,690

- ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,150, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,530

- చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,140, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.53,610

- కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,150, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,530

- బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,200, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,580

- పూణెలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధ‌ర రూ.48,180, 24 క్యారెట్ల 10 గ్రాముల ధ‌ర రూ.52,580

- హైద‌రాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,150, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,530

- విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,150, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,530

- విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,150, 24 క్యారెట్ల ధర రూ.52,530

Next Story