భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు..

Gold and Silver Prices Witness a Drop. దేశీయంగా పసిడి ధరలు తగ్గుముఖం పట్టాయి.

By Medi Samrat  Published on  3 March 2021 9:39 AM IST
Gold and Silver Prices Witness a Drop

దేశీయంగా పసిడి ధరలు తగ్గుముఖం పట్టాయి. దేశీయంగా బంగారం ధరల్లో చోటు చేసుకుంటున్న పరిణామాల కారణంగా ధరల్లో మార్పు చేర్పులు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా పసిడి ధరలు దిగి వస్తున్నాయి. దేశీయంగా పది గ్రాముల బంగారం ధరపై రూ.520 మేర దిగి వచ్చింది.

ఇక దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,420 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.45,480 ఉంది. హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 42,100 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.45,930 ఉంది. ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 44,420 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.45,420 ఉంది. ఇక చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.42,660 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,540 ఉంది. కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,640 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,340, బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 42,100 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.45,930 ఉంది. అయితే తాజా ధరలు పరిస్థితులను బట్టి ధరల్లో మార్పు చేర్పులు ఉంటాయి.

కాగా, దేశీయంగా పసిడ ధరలపై ప్రభావం చూపే అంశాలు చాలా ఉన్నాయి. ద్రవ్యోల్బణం, గ్లోబల్‌ మార్కెట్‌ పసిడి ధరల్లో మార్పు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వడ్డీ రేట్లు, జువెలరీ మార్కెట్‌, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్దాలు వంటి పలు అంశాలపై పసిడి ధరలపై ప్రభావం చూపుతాయని బులియన్‌ మార్కెట్‌ నిపుణులు చెబుతున్నారు. కాగా, ఇటీవల నుంచే బంగారం ధరల్లో చాలా మార్పులు చోటు చేసుకుంటున్నాయి. కొన్ని రోజులు ధరలు పెరుగుతుంటే..

వెండి ధరలు..

ఇక దేశ వ్యాప్తంగా బంగారం, వెండి ధరలు తగ్గుముఖం పడుతున్నాయి. ఇప్పటికే బంగారం ధరలు దిగి వస్తుండగా, అందే బాటలో వెండి కూడా పయనిస్తోంది. తాజాగా బుధవారం కిలో వెండి ధరపై సుమారు 910 రూపాయల మేర దిగి వచ్చింది. ఇక దేశ రాజధాని ఢిల్లీలో కిలో వెండి ధర రూ. 66,600 ఉండగా, హైదరాబాద్‌లో 72,000 ఉంది. చెన్నైలో రూ. 72,000 ఉండగా, ముంబైలో రూ.66,600 ఉంది. కోల్‌కతాలో రూ.67,600 ఉండగా, బెంగళూరులో రూ.67,600 ఉంది. విజయవాడలో కిలో వెండి ధర రూ.72,000 వద్ద కొనసాగుతోంది.




Next Story