రీఫైనాన్స్‌ అంటే ఏమిటి?

ఒక రుణాన్ని మరొక రుణంతో భర్తీ చేసే ప్రక్రియను రుణ ఏకీకరణ (రీ ఫైనాన్స్‌) అని అంటారు. సరళంగా చెప్పాంలే.. ఇప్పటికే ఉన్న పలు అప్పులన్నీ ఒకేసారి తీర్చడానికి ఒక పెద్ద అప్పు చేయడాన్ని రీఫైనాన్స్‌ అని పిలుస్తారు.

By అంజి
Published on : 24 Jun 2025 10:29 AM IST

refinance, Business, Credit card, High interest burden

రీఫైనాన్స్‌ అంటే ఏమిటి?

ఒక రుణాన్ని మరొక రుణంతో భర్తీ చేసే ప్రక్రియను రుణ ఏకీకరణ (రీ ఫైనాన్స్‌) అని అంటారు. సరళంగా చెప్పాంలే.. ఇప్పటికే ఉన్న పలు అప్పులన్నీ ఒకేసారి తీర్చడానికి ఒక పెద్ద అప్పు చేయడాన్ని రీఫైనాన్స్‌ అని పిలుస్తారు. దీని వల్ల అధిక వడ్డీ భారం నుంచి బయటపడొచ్చు..

ప్రయోజనాలు

మీరు ఒకటికి మించి రుణాలు తీసుకుంటే.. వేర్వేరు తేదీల్లో వాయిదాలు చెల్లించాల్సి ఉంటుంది. కానీ, రీఫైనాన్స్‌ వల్ల నెలకు ఒక్కసారి మాత్రమే వాయిదాను చెల్లించాలి. దీనివల్ల కాస్త ఒత్తిడి తగ్గుతుంది. అన్ని రుణాలను గుర్తుంచుకొని, ఆ సమయానికి డబ్బు సమకూర్చుకుని, వాయిదాలు చెల్లించడం కాస్త కష్టంతో కూడిన వ్యవహారం. రుణ ఏకీకరణ ఆ కష్టాన్ని సులభతరం చేస్తుంది.

మీరు క్రెడిట్‌ కార్డుపై లోన్‌, వ్యక్తిగత రుణాలు వంటివి తీసుకుని ఉంటే.. వాటికి చెల్లించాల్సిన వడ్డీ అధికంగా ఉంటుంది. రుణ ఏకీకరణ వల్ల.. ఆ వడ్డీ భారం తప్పుతుంది. క్రెడిట్‌ స్కోర్‌ కూడా కొంత మేర పెరుగుతుంది.

ఈ విషయాలు తెలుసుకోండి

రుణభారం తగ్గాలనే రీఫైనాన్స్‌ చేస్తారు. కాబట్టి.. మీ క్రెడిట్‌ స్కోర్‌ 750 కన్నా ఎక్కువగా ఉంటే.. తక్కువ వడ్డీకే రుణం ఇవ్వమని బ్యాంకు అధికారులను కోరాలి.

వివిధ బ్యాంకులు, ఫైనాన్షియల్‌ సంస్థల నుంచి లోన్‌ రీఫైనాన్స్‌ అఫర్స్ గురించి తెలుసుకోవాలి. వడ్డీరేట్లు, ఫీజులు, షరతులు వంటి వివరాలు కూడా క్లుప్తంగా గమనించాలి. వాటన్నింటినీ పోల్చుకున్నాక.. ఏది ఉత్తమం అనిపిస్తే.. అక్కడ రుణం తీసుకోవాలి.

తక్కువ వడ్డీ రుణాలకు ఒకే అప్పుగా మార్చడం వల్ల పెద్దగా ప్రయోజనం ఉండదు. కాబట్టి ఇలాంటి వాటికి రీఫైనాన్సింగ్‌ చేయకపోవడమే బెటర్‌.

రుణం ఎలా తీసుకోవాలి?

గృహరుణం, కార్‌ లోన్‌లపై టాపప్‌ తీసుకుంటే.. చిన్నపాటి రుణాలను క్లియర్‌ చేయవచ్చు. మీరు కొత్త బ్యాంకుకు మారితే వారు పెద్ద మొత్తంలో లోన్‌ ఇచ్చే అవకాశం ఉంటుంది. దీంతో మీరు అన్ని రుణాలను తీర్చేయవచ్చు. బంగారాన్ని తాకట్టు పెట్టడం వల్ల అధిక ప్రయోజనం ఉంటుంది. మీ మొదటి ప్రాధాన్యత దీనికి ఇవ్వడమే బెటర్.

Next Story