సామాన్యుడిపై భారం.. వ‌రుస‌గా రెండో రోజు పెరిగిన ఇంధ‌న ధ‌ర‌లు

Fuel prices increased second straight day.ఓ వైపు క‌రోనా మ‌హ‌మ్మారి ఇబ్బంది పెడుతుంటే.. మ‌రోవైపు ఇంధన

By తోట‌ వంశీ కుమార్‌  Published on  11 May 2021 3:46 AM GMT
fuel prices hike

ఓ వైపు క‌రోనా మ‌హ‌మ్మారి ఇబ్బంది పెడుతుంటే.. మ‌రోవైపు ఇంధన ధ‌ర‌లు పెరుగుకుంటూ పోతున్నాయి. గ‌త వారంలో నాలుగు రోజుల పాటు ధ‌ర‌ల‌ను పెంచిన చ‌మురు కంపెనీలు.. శ‌నివారం, ఆదివారం విరామం ఇచ్చి నిన్న‌టి(సోమ‌వారం) నుంచి మ‌ళ్లీ సామాన్యుడిపై భారం మోపుతున్నాయి. సోమ‌వారం పెట్రోల్, డీజిల్‌పై 26 పైసలు, 33 పైసల చొప్పున బాదగా.. తాజాగా నేడు మ‌ళ్లీ 27 పైస‌లు, 20 పైస‌ల చొప్పున పెంచుతూ నిర్ణ‌యం తీసుకున్నాయి. దీంతో దేశ‌రాజ‌ధాని ఢిల్లీలో లీట‌ర్ పెట్రోల్‌ ధ‌ర రూ.91.80కు, డీజిల్ ధ‌ర రూ.82.36కు చేరాయి.

ప్ర‌ధాన న‌గ‌రాల్లో ఇంధ‌న ధ‌ర‌లు ఇలా..

ఢిల్లీలో - లీట‌ర్ పెట్రోల్‌ రూ.91.80 - డీజిల్ రూ.82.36

ముంబైలో - లీట‌ర్ పెట్రోల్ రూ.98.12 - డీజిల్ రూ.89.48

చెన్నైలో - లీట‌ర్ పెట్రోల్‌ రూ.93.62 - డీజిల్ రూ.87.25,

కోల్‌క‌తాలో - లీట‌ర్ పెట్రోల్ రూ.91.92 - డీజిల్ రూ.85.20

బెంగళూరులో - లీట‌ర్ పెట్రోల్ రూ.94.85 - డీజిల్ రూ.87.31

హైదరాబాద్‌లో - లీటర్ పెట్రోల్ రూ.95.41 - డీజిల్ రూ.89.79

విజయవాడలో - లీట‌ర్ పెట్రోల్ రూ.97.86 గా - డీజిల్ రూ.91.67 గా

రోజువారీ స‌మీక్ష‌లో భాగంగా ప్ర‌తిరోజు ఉద‌యం 6 గంట‌ల‌కు దేశీయ చ‌మురు కంపెనీలు పెట్రోల్, డీజిల్ ధ‌ర‌ల‌ను స‌వ‌రిస్తూ ఉంటాయి. అయితే చ‌మురు ఉత్ప‌త్తుల‌పై ఒక్కో రాష్ట్రంలో ఒక్కో విధంగా ప‌న్నులు వ‌సూలు చేస్తుండ‌టంతో పెట్రోల్‌, డీజిల్ ధ‌ర‌ల్లో ఎక్కువ త‌క్కువ‌లు ఉంటాయి.


Next Story