సామాన్యుడికి మరోసారి పెట్రో ధరలు షాకిచ్చాయి. దేశవ్యాప్తంగా మరోసారి డీజిల్, పెట్రోలు ధరలు పెరిగిపోయాయి. రోజువారీ సమీక్షలో భాగంగా వరుసగా రెండో రోజు చమురు ధరలు పెరిగి కొత్త గరిష్టాలను తాకాయి. బుధవారం పెట్రోల్‌పై రూ.30 పైసలు, డీజిల్‌పై రూ.25పైసలు పెరిగింది. దీంతో దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ. 87.60 కి చేరింది. అలాగే డీజిల్ ధర రూ. 77. 73 కు పెరిగింది.
ప్రధాన నగరాల్లో ధరలు ఎలా ఉన్నాయంటే..?
ముంబై - పెట్రోల్ రూ. 94.12 - డీజిల్ రూ.84. 63
హైదరాబాద్ - పెట్రోల్ రూ. 91.09 - డీజిల్ ధర రూ.84. 79
బెంగళూరు - పెట్రోల్ రూ. 90.53 - డీజిల్ రూ. 82.40
చెన్నై - పెట్రోల్ రూ.89.96 - డీజిల్ రూ. 82. 90
అంతర్జాతీయ ధరలు. విదేశీ మారక ధరల ఆధారంగా దేశీయ చమురు సంస్థలు పెట్రోలు, డీజిల్ ధరలను రోజువారీగా సవరిస్తుంటాయి. అయితే.. వ్యాట్, ఇతర పన్నులతో వీటి ధరలు ఒక్కో రాష్ట్రంలో ఒక్కోలా ఉంటాయి.