పెట్రో మంట ఇప్పట్లో ఆరేలా కనిపించడం లేదు. వరుసగా 12 రోజు కూడా చమురు ధరలు పెరిగాయి. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు పెరగడంతో లీటర్ పెట్రోలుపై 39 పైసలు, డీజిల్‌పై 37 పైసలు పెంచుతూ దేశీయ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. తాజా ధరల పెంపుతో ఢిల్లీలో లీటర్ పెట్రోలు రూ. 90.58కి చేరగా.. డీజిల్ ధర రూ. 80.97గా ఉంది. మహారాష్ట్ర, రాజస్థాన్, మధ్యప్రదేశ్‌లోని కొన్ని నగరాల్లో పెట్రోల్ ధరలు ఇప్పటికే రూ.100 దాటాయి. ఇక బెంగళూరులో లీటర్ పెట్రోల్ రూ.93.67, డీజిల్ రూ.85.84కు చేరాయి. హైదరాబాద్‌లో పెట్రోల్, డీజిల్‌పై 40 పైసల చొప్పున పెరిగాయి. దీంతో లీటర్ పెట్రోల్ రూ.94.18, డీజిల్ రూ.88.31గా ఉన్నాయి. పెట్రోలు, డీజిల్ ధరలు వరుసగా పెరుగుతుండడంతో దేశ వ్యాప్తంగా వినూత్న రీతుల్లో నిరసలు వెల్లువెత్తుతున్నాయి.
ప్రధాన నగరాల్లో ఇంధన ధరలు ఎలా ఉన్నాయంటే..?
ఢిల్లీలో - పెట్రోలు రూ. 90.58 - డీజిల్ ధర రూ. 80.97
కోల్‌కతాలో - పెట్రోల్ రూ.91.78 - డీజిల్ రూ.84.56
చెన్నైలో - పెట్రోల్ రూ.92.59 - డీజిల్ రూ.85.98
జైపూర్‌లో - పెట్రోల్ రూ.96.69 - డీజిల్ రూ.89.04
పట్నా- పెట్రోల్ రూ.92.81 - డీజిల్ రూ.86.10
హైదరాబాద్‌లో - పెట్రోల్ రూ.94.18 - డీజిల్ రూ.88.31