గత కొద్ది రోజులుగా ఇంధన ధరలు పెరుగుతూ వాహనదారులకు చుక్కలు చూపిస్తున్నాయి. ఎప్పుడైతే నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతానికి జరగనున్న అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసిందో.. అప్పటి నుంచి ఇంధనలు పెరగడం ఆగిపోయాయి. ఆయా రాష్ట్రాల ఎన్నికల ఫలితాల అనంతరం ధరలుకు మళ్లీ రెక్కలొచ్చాయి. వరుసగా ఇంధన ధరలు పెరుగుతున్నాయి. తాజాగా ఆదివారం కూడా లీటర్ పెట్రోల్ పై 24 పైసలు, లీటర్ డీజిల్ పై 27 పైసలు పెంచుతూ చమురు కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. ఈ పెంపుతో ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ. 92.58చేరగా.. లీటర్ డీజిల్ ధర రూ. 83.22కు చేరింది.
ప్రధాన నగరాల్లో ఇంధన ధరలు ఇలా..
ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ. 92.58, డీజిల్ లీటర్ ధర రూ.83.22
ముంబయిలో పెట్రోల్ రూ. 98.88, డీజిల్ రూ. 90.40
చెన్నైలో పెట్రోల్ రూ. 94.31, డీజిల్ రూ. 88.07
బెంగళూరులో పెట్రోల్ రూ. 95.33, డీజిల్ రూ. 87.92
హైదరాబాద్‌లో పెట్రోల్ రూ. 96.22, డీజిల్ ధర రూ. 90.73
విజయవాడలో పెట్రోల్ రూ. 99.23, డీజిల్ రూ. 93.11