సిబిల్‌ స్కోర్‌ పెంచుకోండి ఇలా..

ప్రస్తుత రోజుల్లో బ్యాంకుల నుంచి రుణం కావాలంటే మన సిబిల్‌ స్కోర్‌ కీలకం. క్రెడిట్‌ ఇన్ఫర్మేషన్‌ బ్యూరో ఇండియా లిమిటెడ్‌ అందించే ఈ క్రెడిట్‌ స్కోరునే సిబిల్‌ స్కోరు అంటారు.

By అంజి  Published on  25 Dec 2023 8:15 AM GMT
CIBIL score, Bank, Credit card

సిబిల్‌ స్కోర్‌ పెంచుకోండి ఇలా..

ప్రస్తుత రోజుల్లో బ్యాంకులు, ఆర్థిక సంస్థల నుంచి రుణం కావాలంటే మన సిబిల్‌ స్కోర్‌ కీలకం. క్రెడిట్‌ ఇన్ఫర్మేషన్‌ బ్యూరో ఇండియా లిమిటెడ్‌ అందించే ఈ క్రెడిట్‌ స్కోరునే సిబిల్‌ స్కోరు అంటారు. మనం ఎలాంటి రుణం పొందాలన్నా.. ఈ స్కోర్‌ అత్యుత్తమంగా ఉండటం ఎంతో ముఖ్యం. ఇది రుణం కోరే వ్యక్తుల ఆర్థిక స్థితిని, ఆర్థిక క్రమశిక్షణను చెప్పే ఓ సూచిక. మనం పూర్వం తీసుకున్న రుణాలు, క్రెడిట్‌ కార్డు బకాయిలను గడిచిన 36 నెలల్లో ఎంత బాధ్యతగా మేనేజ్‌ చేస్తున్నారనేది ఇందులో తెలిసిపోతుంది. కనుక సిబిల్‌ స్కోరు బాగుంటే.. బ్యాంకులు త్వరగా రుణం మంజూరు చేస్తాయి. .ఇది 300 - 900 మధ్య ఉంటుంది. అయితే అసలు ఈ స్కోర్‌ని ఎలా మెయింటైన్‌ చేయాలనే విషయాలను ఇక్కడ చదవండి.

సిబిల్‌ స్కోర్‌ శ్లాబులు ఇవే

- 300 - 550 తక్కువ

- 550 - 650 ఫర్వాలేదు

- 650 - 750 బాగుంది

- 750 - 900 అత్యుత్తమం

ఈ అంశాలు చాలా కీలకం

సిబిల్‌ స్కోరులో కీలక అంశం.. గత చెల్లింపుల చరిత్ర. దీనికి 30 శాతం ప్రాధాన్యత ఉంటుంది. గతంలో రుణాల చెల్లింపు ఆలస్యం అయినా, ఎగవేతకు పాల్పడినా, ఈఎంఐలను పెండింగ్‌లో పెట్టినా, క్రెడిట్‌ కార్డులు బ్లాక్‌ అయినా సిబిల్‌ స్కోరుపై చెడు ప్రభావం పడుతుంది. ఇలా కాకుండా.. వాయిదాల చెల్లింపులో జాగ్రత్తగా ఉండండి. అప్పుడే మీ క్రెడిట్‌ స్కోరు పెరుగుతూ వస్తుంది. వాయిదాలను ఎప్పటికప్పుడు సకాలంలో చెల్లించండి.

సిబిల్‌ను 25 శాతం ప్రభావితం చేసే రెండో అంశం క్రెడిట్‌ యూటిలైజేషన్ రేషియో, క్రెడిట్‌ కార్డ్‌ లిమిట్‌ ఎంత ఉంది? అందులో ఎంత వాడారు? అనేది చూస్తారు. తరచూ కార్డులో ఉన్న మొత్తం అంతా వాడే వారు డిఫాల్ట్ జాబితాలోకి వెళ్తారు. అందుకే క్రెడిట్‌ యుటిలైజేషన్‌ రేషియో 40 శాతం మించకుండా చూసుకోండి.

ఇటీవలి కాలంలో ఎన్నిసార్లు రుణం కోసం దరఖాస్తు చేశారు? ఎన్నిసార్లు రిజెక్ట్‌ అయ్యింది? ఎన్ని దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి? క్రెడిట్‌ స్కోరు హార్డ్‌ ఎంక్వైరీలు వంటి అంశాల మీద మరో 30 శాతం సిబిల్‌ స్కోరు ఆధారపడి ఉంటుంది.

కొన్నిసార్లు మనం పొరపాటేమీ చేయకున్నా స్కోరు తగ్గుతూ వస్తుంది. ఇలాంటప్పుడు మీ క్రెడిట్‌ నివేదికను ఒకసారి పరిశీలించండి. వాటిలో ఏమైనా సందేహాలు ఉంటే వెంటనే బ్యాంకు, క్రెడిట్‌ బ్యూరోలకు ఫిర్యాదు చేయండి.

Next Story