నేటి కాలంలో బ్యాంకు చెక్కుల వినియోగం బాగా పెరిగింది. ట్రాన్సాక్షన్‌లో నగదువు బదులుగా చెక్కు వాడాల్సి రావటమే దీనికి కారణం. అయితే తరచూ చెక్ బౌన్స్ అయితే చిక్కుల్లో పడకతప్పదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీని వాకం విషయంలో నిపుణులు చెబుతున్న కొన్ని కీలక అంశాలు మీకోసం..
బౌన్స్‌కు కారణాలు
- బ్యాంకు ఖాతాలో డబ్బులు తక్కువగా ఉండటం
- అప్పటికే మరొక మొత్తానికి చెక్ ఇచ్చి ఉండటం
- చెక్కుపై పొందుపరిచిన నంబర్ సరిగ్గా లేకపోవడం
- చెక్ చిరగటం, తడవటం, నలిగిపోవటం వంటివి అసలు చేయకూడదు.
- చెక్‌బౌన్స్ కేసులకు నెగోషియబుల్ ఇన్‌స్ట్రుమెంట్స్ యాక్ట్ కింద జరిమానా, జైలుశిక్ష పడొచ్చు.
- ఇదే రిపీటయితే చెక్‌బుక్ రద్దు, బ్యాంక్ ఖాతా బ్లాక్ కావటం, లీగల్ నోటీసులూ రావొచ్చు.
- క్రెడిక్ స్కోర్, సివిల్ స్కోర్‌పైనా దీని ప్రభావం పడి భవిష్యత్ రుణాలు పొందడం కష్టమవుతుంది.
జాగ్రత్తలు
- చెక్కు జారీ చేసేటప్పుడు ఖాతాలో తగినంత నగదు ఉందో లేదో చెక్ చేయాలి.
- బ్యాంకులో ఉన్న సంతకమే చెక్ మీద కరెక్ట్‌గా ఉందో లేదో సరిచూసుకోవాలి.
- చెక్కుపై నింపిన వివరాలు సమాచారాన్ని జాగ్రత్తగా నమోదు చేయాలి.