ఫ్లిప్‌కార్ట్‌ బిగ్‌ బిలియన్‌ డేస్‌ సేల్ తేదీలు వ‌చ్చేశాయి.. ఎప్పుడంటే

Flipkart Big Billion Days Sale 2022 dates announced.ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియ‌న్ డేస్ సేల్‌ను నిర్వ‌హించ‌నుంది.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  14 Sep 2022 3:19 AM GMT
ఫ్లిప్‌కార్ట్‌ బిగ్‌ బిలియన్‌ డేస్‌ సేల్ తేదీలు వ‌చ్చేశాయి.. ఎప్పుడంటే

ప్ర‌ముఖ ఈ-కామ‌ర్స్ దిగ్గ‌జం ఫ్లిప్‌కార్ట్ ప్ర‌తి సంవ‌త్స‌రం లాగానే ఈ సారి కూడా బిగ్ బిలియ‌న్ డేస్ సేల్‌ను నిర్వ‌హించ‌నుంది. ప్ర‌తి సారి సెప్టెంబ‌ర్ నెల‌లో ఈ సేల్ ప్రారంభం అవుతున్న సంగ‌తి తెలిసిందే. కొద్ది రోజులుగా ఈ సేల్‌కు సంబంధించిన ప్ర‌క‌ట‌న‌ల‌తో టీజ్ చేస్తూ వ‌చ్చిన ఫ్లిప్‌కార్ట్ ఎట్ట‌కేల‌కు సేల్ జ‌ర‌గ‌నున్న తేదీల‌ను ప్ర‌క‌టించింది. ఈ సేల్‌ను ఈ నెల 23 నుంచి 30 వ‌ర‌కు నిర్వ‌హించ‌నున్న‌ట్లు తెలిపింది. కాగా.. మ‌రో దిగ్గ‌జ ఈ కామ‌ర్స్ అమెజాన్ కూడా త‌మ గ్రేట్ ఇండియ‌న్ సేల్‌ను ఈ తేదీల‌కు అటు, ఇటుగా ప్రారంభించే అవ‌కాశం ఉంది.

ఇక ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియ‌న్ డేస్ సేల్‌లో స్మార్ట్ ఫోన్లు, ల్యాప్ టాప్స్‌, స్మార్ టీవీలు, ఎల‌క్ట్రానిక్ వ‌స్తువులు చాలా త‌క్కువ ధ‌ర‌కే ల‌భించ‌నున్నాయి. ఈ సేల్‌ ప్లస్‌ మెంబర్ల కోసం ఒక రోజు ముందుగానే అంటే 22వ తేదీ అర్ధరాత్రి నుంచి ప్రారంభం కానుండ‌గా.. ఇతర సభ్యుల కోసం 23 నుం చి ప్రారంభం అవుతుంది.

సేల్ లో ఐసీఐసీఐ, యాక్సిస్‌ బ్యాంక్‌ డెబిట్, క్రెడిట్‌ కార్డులపై 10 శాతం ఇన్‌స్టంట్‌ డిస్కౌంట్‌ ఇవ్వనున్నట్టు ఫ్లిప్‌ కార్ట్ తెలిపింది. వీటితో పాటు పేటీఎం యూపీఐ, వాలెట్‌ లావాదేవీలపైనా 10 శాతం దాకా తగ్గింపు ఇస్తున్నట్టు చెప్పింది. అంతేకాకుండా.. ఆఫర్ కొనసాగే రోజుల్లో అర్ధరాత్రి 12 గంటలకు, ఉదయం 8 గంటలకు, సాయంత్రం 4 గంటలకు రష్‌ అవర్స్‌ పేరిట ప్రత్యేక డీల్స్‌ అందుబాటులో ఉంటాయని తెలిపింది.


ఈ బిగ్‌ బిలియన్‌ డేస్‌ సేల్‌లో స్మార్ట్‌ టీవీలపై 50 శాతం వరకు, ఎయిర్‌ కండిషనర్లు, రిఫ్రిజిరేటర్లపై 55 శాతం వరకు తగ్గింపు పొందే అవకాశం దక్కించుకోవచ్చు. ఎక్కువగా స్మార్ట్‌ఫోన్లు, స్మార్ట్‌ టీవీలు, ఇతర ఎలక్ట్రానిక్‌ వస్తువులపై దాదాపు 80 శాతం వరకు డిస్కౌంట్ పొంద‌వ‌చ్చు. పోకో ఎఫ్‌ 4, పోకో ఎక్స్ 4 ప్రో 5జీ, గూగుల్ పిక్సల్‌ 6ఏ, ఒప్పో రెనో 8, మోటోరొలా ఎడ్జ్‌ 30, రియల్‌ మీ 9 5జీ, పోకో సీ 31, వివో టీ1 5జీ, శాంసంగ్‌ ఎఫ్‌ 13 ఫోన్లపై భారీ డిస్కౌంట్లు ఉండబోతున్నట్టు పేర్కొంది. ఫ్లిప్‌కార్ట్‌ ఫ్లాట్‌ఫారమ్‌లో 250 మిలియన్లకుపైగా ఉత్ప‌త్తులు అందుబాటులో ఉన్నాయి.

Next Story