శుభ‌వార్త‌.. భారీగా త‌గ్గిన బంగారం ధ‌ర‌

February 26th Gold Rate.పసిడి ధ‌ర‌ల్లో నిత్యం హెచ్చుత‌గ్గులు చోటు చేసుకుంటాయ‌న్న సంగ‌తి తెలిసిందే. ఓ

By తోట‌ వంశీ కుమార్‌  Published on  26 Feb 2022 1:43 AM GMT
శుభ‌వార్త‌.. భారీగా త‌గ్గిన బంగారం ధ‌ర‌

పసిడి ధ‌ర‌ల్లో నిత్యం హెచ్చుత‌గ్గులు చోటు చేసుకుంటాయ‌న్న సంగ‌తి తెలిసిందే. ఓ రోజు ధ‌ర త‌గ్గితే మ‌రో రోజు పెరుగుతూ ఉంటుంది. నిన్న భారీగా పెరిగిన బంగారం ధ‌ర నేడు తగ్గింది. శ‌నివారం 10 గ్రాముల ప‌సిడి ధ‌ర‌పై రూ.400 మేర త‌గ్గింది. దేశంలోని ఆయా ప్రాంతాల్లో ఉన్న ప‌రిస్థితులు, డిమాండ్ ఆధారంగా ప‌సిడి ధ‌ర‌ల్లో తేడాలుంటాయి. దేశీయంగా 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,850 ఉండ‌గా.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,110 వ‌ద్ద కొన‌సాగుతోంది.

ప్ర‌ధాన న‌గ‌రాల్లో పసిడి ధ‌ర‌లు..

- ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,260, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,110

- ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,850, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,110

- చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,010, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,370

- కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,850, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,110

- బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,850, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,110

-పూణెలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధ‌ర రూ.46,900, 24 క్యారెట్ల 10 గ్రాముల ధ‌ర రూ.51,200

- హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,850, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,110

- విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,850, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,110

- విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,850, 24 క్యారెట్ల ధర రూ.51,110

వెండి ధ‌ర‌లు..

కిలో వెండి ధ‌ర‌ ఢిల్లీలో రూ. 70,000, ముంబైలో రూ. 65,000, చెన్నైలో ధర రూ. 65,000, కేరళలో రూ. 70,000, హైదరాబాద్‌లో రూ. 70,000, విజయవాడలో రూ. 70,000, విశాఖపట్నంలో రూ.70,000 గా ఉంది.

బంగారం ధరల్లో హెచ్చుతగ్గులకు ఎన్నో కారణాలుంటాయి. అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, కరోనా, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు బంగారం రేట్లపై అధిక ప్రభావం చూపే అవకాశం ఉందని బులియన్‌ మార్కెట్‌ నిపుణులు చెబుతున్నారు.

Next Story